Venkatesh: వెంకటేష్ కూతురి నిశ్చితార్దానికి ఆ స్టార్ హీరోని పిలవలేదా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద టాప్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న దగ్గుబాటి వెంకటేష్ ఇంట పెళ్లి సందడి మొదలైంది. వెంకటేష్ కి ముగ్గురు కూతుళ్లు. ఇప్పటికే పెద్ద కూతురు అశ్రిత పెళ్లి జైపూర్ లో కన్నుల పండుగగా జరిపించారు. ఇక ఇప్పుడు ఆయన రెండవ కూతురు కూడా పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైంది. వెంకటేష్ రెండో కుమార్తె హయ వాహిని నిశ్చితార్థం బుధవారం రాత్రి హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. విజయవాడకు చెందిన ఓ డాక్టర్ కుమారుడితో వెంకటేష్ రెండవ కుమార్తె వివాహం జరగనుంది.

వచ్చే ఏడాది ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు సమాచారం. అయితే ఈ నిశ్చితార్థం వేడుకకు టాలీవుడ్ కి చెందిన ప్రముఖులు హాజరయ్యారు. చిరంజీవి, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇండస్ట్రీలో ఉండే బడా హీరోలను పిలిచిన వెంకటేష్ ఓ టాప్ హీరోని మాత్రం మిస్ చేశాడని, ఆ హీరో పై ఉన్న కోపంతో కావాలనే వెంకటేశ్ ఆయనను పిలవలేదు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

ఆ టాప్ హీరో ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అయితే ఆ హీరోని పిలవకపోవడంతో ఆయన అభిమానులు మండిపడుతున్నారు. అంతేకాదు టాలీవుడ్ ఇండస్ట్రీ అంటే మనకు గుర్తొచ్చేది ఈ హీరోలే. అలాంటి వాళ్లలో ముగ్గురు కనిపించి మిగతా హీరో కనిపించకపోవడంతో వెంకటేష్ కావాలనే ఆ హీరో పై కోపంతో ఇన్వైట్ చేయలేదని కామెంట్స్ చేస్తున్నారు

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు