NBK108 : బాలీవుడ్ భామనే ఫిక్స్

నందమూరి బాలయ్య అఖండ హిట్ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK107 అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీని షూటింగ్ సుమారు సగానికి పైగా అయిపోయింది. షూటింగ్ ను పూర్తి చేసి, ఈ సంవత్సరం డిసెంబర్ లో కానీ, వచ్చే సంక్రాంతి బరిలో కానీ ఉంచాలని మూవీ యూనిట్ చూస్తుంది. NBK107 తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య ఒక సినిమా చేస్తున్నాడు. దానికి NBK108 అనే వర్కింగ్ టైటిల్ ను పెట్టారు.

కొన్ని ఇంటర్వ్యూల్లో అనిల్ రావిపూడి NBK108 స్టోరీ గురించి క్లూ లు కూడా ఇచ్చాడు. రాబోయే సినిమాలో బాలయ్య 50 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి పాత్రలో కనిపిస్తాడని, బాలయ్యకు కూతురి పాత్రలో పెళ్లి సందD హీరోయిన్ శ్రీలీల ఉంటుందని అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చాడు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, NBK108లో బాలీవుడ్ భామ సోనాక్షి సిన్షా నటిస్తుందట.

సినిమాలో ఒక కీలక పాత్రలో సోనాక్షి సిన్షా కనిపిస్తుందని సమాచారం అందుతుంది. ముందుగా ఈ పాత్ర కోసం ప్రియమణిని తీసుకోవాలని అనుకున్నారని వార్తలు వచ్చాయి. కానీ చివరికి సోనాక్షి సిన్షా నే అనిల్ రావిపూడి ఫిక్స్ చేశారని టాక్ వినిపిస్తుంది. అయితే ఇది నిజమా లేదా పుకార్లా అని తెలియాలంటే మూవీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురు చూడాలి మరి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు