Sukumar- Alluarjun: వేర్వేరు దారుల్లో

సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప సినిమాతో వీరి కాంబినేషన్ స్టామినా ఏంటో ఇండియా మొత్తం అర్ధమైంది. పుష్ప చిత్రం ఊహించని స్థాయిలో విజయాన్ని సాధించింది. అందుచేత పుష్ప – 2 చిత్రం పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. సినీ ప్రేమికులు, బన్నీ అభిమానులు పుష్ప 2 సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

కానీ ప్రస్తుతం సుకుమార్, బన్నీ వేర్వేరు పనుల్లో బిజీ అయిపోయారు. పుష్ప చిత్రం గ్యాప్ తరువాత బన్నీ కొన్ని యాడ్స్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. త్రివిక్రమ్, హరీష్ శంకర్ లాంటి దర్శకులతో ఇదివరకే సినిమాలు చేసిన అల్లు అర్జున్ ఇప్పుడు యాడ్స్ షూటింగ్ లో బిజీ అయ్యాడు. మరోవైపు సుకుమార్ తన శిష్యులతో స్టోరీ సిట్టింగ్స్ లో కూర్చున్న ఫొటోస్ వైరల్ అయ్యాయి.
ఈ ఫొటోస్ చూసిన చాలామంది. పుష్ప 2 పనులు మొదలు పెట్టేసారు అనుకున్నారు. కానీ రీసెంట్ గా సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు వేసిన ట్వీట్ తో అందరికి ఒక క్లారిటీ వచ్చింది.

ట్విట్టర్ వేదికగా బుచ్చిబాబు ఒక ఫోటోను షేర్ చేస్తూ,
ఈ photo నేను తరువాత చేయబోయే నాసినిమాకథ Discussion సందర్భంలోది మాగురువుగారు “సుకుమార్” Sir నా కోసం నా సినిమా కథ కోసం Help చేయడానికి వచ్చారు. సుకుమార్ Sir సినిమా కథలో కూర్చుని Discussion చేసేంత స్థాయి నాకు లేదు రాదు.ఆయన నుంచి నేర్చుకోవడం తీసుకోవడమే తప్ప , ఆయనకి ఇచ్చేంత లేదు. అని రాసుకొచ్చాడు.

- Advertisement -

ఇటువైపు వైపు శిష్యులు కథ చర్చల్లో సుకుమార్, మరోవైపు యాడ్స్ షూటింగ్స్ లో బన్నీ వేర్వేరు దారుల్లో ఉన్నారు.ఇద్దరు కలసి ఒక త్రాటిపైకి వచ్చి పుష్ప 2 చిత్రం బిజీలో ఎప్పుడు పడతారు అనేది చాలామంది సందేహం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు