National crush Rashmika: ఆ ముగ్గురు హీరోలకు రష్మిక ముద్దులు ?

రష్మిక మందన్న గురించి తెలుగు వారికి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతోంది. ఈ భామ ప్రస్తుతం తెలుగులో రెయిన్బో అనే లేడీ సెంట్రిక్ మూవీతో పాటు అల్లు అర్జున్ తో పుష్ప ది రూల్ మూవీ కూడా చేస్తోంది. ఇటీవల వారసుడుతో మరో బంపర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం హిందీలో యానిమల్ అనే ప్యాన్ ఇండియా చిత్రంలో నటిస్తోంది.
రణబీర్ కపూర్ హీరోగా చేస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకుడు. వరుస సినిమాలతో అటు హిందీలోనూ, ఇటు తెలుగులోనూ అదరగొడుతున్న రష్మిక మందన్నకు మరో బంపర్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. ఇలా వరుస పాన్ ఇండియన్ సినిమాలతో మంచి ఊపు మీద ఉన్న రష్మికకు మరో క్రేజీ ఆఫర్ వచ్చిందట. లేటెస్ట్ గా తమిళ స్టార్ హీరో విక్రమ్ కు జోడిగా ఓ భారీ సినిమాలో నటించనుందని తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా… ఓ నెటిజన్ ఈ భామను క్రేజీ క్వశ్చన్స్ తో ఆడుకున్నారు.
విజయ్ దేవరకొండతో మీ సినిమా ఎప్పుడు ఉంటుందని అడగ్గా… దానికి రష్మిక…’ఈ ప్రశ్న మీరు విజయ్ ని అడగాలి. కానీ మంచి కంటెంట్ ఉన్న స్టోరీతో ఎవరైనా డైరెక్టర్ వస్తే మేము మూవీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని’ బదులిచ్చింది. మరో నెటిజన్ విజయ్ దళపతి, షారుఖ్, విజయ్ దేవరకొండలో మీరు ఎవరికి లిప్ లాక్ ఇస్తారు అని అడగ్గా… కాస్త ఆలోచించి ఆ ముగ్గురికి ఇస్తానని చెప్పింది. దీంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ‘అవును నీకు ఎంతమంది అయినా ఓకేనా’ అంటూ కొంతమంది జనాలు వల్గర్ కామెంట్లు పెడుతున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు