NBK’s Bhagavanth Kesari: బాలకృష్ణ – రోజా అన్నా చెల్లెలు గా నటించిన సినిమా ఇదే..!

NBK’s Bhagavanth Kesari

తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ – రోజా ది సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అనేక చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సాధించాయి. బాలకృష్ణ – రోజా కాంబినేషన్ అంటేనే అప్పట్లో తిరుగులేని క్రేజ్ ఉండేది. వీరిద్దరిని తెరమీద చూసేందుకు తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తి చూపేవారు. వీరిద్దరి కాంబినేషన్ లో మొత్తం 7 సినిమాలు వచ్చాయి. భైరవద్వీపం, గాండీవం, బొబ్బిలి సింహం, మాతో పెట్టుకోకు, శ్రీకృష్ణార్జున విజయం, పెద్దన్నయ్య, సుల్తాన్ వంటి సినిమాలు వచ్చాయి.
సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో బాలకృష్ణ – రోజా హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన భైరవ ద్వీపం సినిమాలో వీరిద్దరూ తొలిసారిగా నటించారు. ఈ సినిమాతోనే రోజా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే వీరిద్దరూ హీరో హీరోయిన్స్ గా కాకుండా ఓ సినిమాలో బాలయ్యకు రోజా చెల్లెలుగా నటించిన చిత్రం కూడా ఉంది. ఆ సినిమా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. వీరిద్దరి కాంబినేషన్ లో 5వ సినిమాగా వచ్చిన చిత్రం శ్రీకృష్ణార్జున విజయం. ఈ చిత్రానికి కూడా సింగీతం శ్రీనివాస్ దర్శకత్వం వహించారు.
ఈ చిత్రంలో రోజా ద్రౌపది పాత్రలో కనిపిస్తోంది. బాలకృష్ణ ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేసి అందరిని మెప్పించారు. అర్జునుడిగా, శ్రీకృష్ణుడిగా ద్విపాత్రాభినయం పోషించారు. ఈ చిత్రంలో రోజా శ్రీకృష్ణుడి చెల్లెలుగా, అర్జునుడి భార్యగా నటించింది. అయితే ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన మేరకు సక్సెస్ ని అందుకోలేకపోయింది. ఏది ఏమైనా సినీ ఇండస్ట్రీలో వీరిద్దరి కాంబినేషన్ అదుర్స్ అని ఇప్పటికీ ప్రేక్షకులలో మంచి టాక్. మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు