Tamannaah Bhatia career : తమన్నా ను మోసం చేసిన ఆ ఇద్దరు

Tamannaah Bhatia career

మిల్క్ బ్యూటీ తమన్నా మరోసారి మోసపోయింది. అదేంటి హ్యాపీగా ఒక పక్క సినిమాలు చేస్తూ, రియల్ లో కూడా లవర్ తో సంతోషంగా ఉంటున్న తమన్నా మోసపోవడమేంటని అనుకోవచ్చు కానీ అసలు విషయం తెలిసాక ఆశ్చర్య పోవడం ఖాయం.

గతకొద్ది రోజులుగా తమన్నాకు తెలుగులో అవకాశాలు రాకపోవడంతో టాలీవుడ్ దూరమైన సంగతి తెలిసిందే. కెరీర్ బిగినింగ్ లోనే దాదాపు అందరు స్టార్ హీరోలతో తమన్నా వర్క్ చేయడం వల్ల ప్రస్తుతం ఆమెకు సీనియర్ హీరోలే దిక్కు అవుతున్నారు.

ఇటీవలనే తమన్నా చాలా గ్యాప్ మరోసారి సౌత్ సినిమాలతో బిజీ అయింది. సూపర్ స్టార్ రజినీకాంత్ తో జైలర్ సినిమాలో మరియు మెగాస్టార్ చిరంజీవితో భోళా శంకర్ సినిమాలలో ఆమె నటించింది. అయితే ఈ రెండు సినిమాలు ప్రస్తుతం థియేటర్స్ లో విజయవంతంగా ప్రదర్షింపబడుతున్నాయి.

- Advertisement -

కాగా జైలర్ సినిమాలో ముందు నుంచి తమన్నా హీరోయిన్ అంటూ చెప్పుకుంటూ వచ్చిన మూవీ టీం తీరా చూస్తే తమన్నా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించి అందరిని ఆశ్చర్య పరిచింది. ఇక భోళా శంకర్ సంగతి చూసుకుంటే జైలర్ కంటే ఈ సినిమాలో తమన్నా పాత్ర కాస్త మెరుగు అనే చెప్పాలి. స్క్రీన్ టైం ప్రకారంగా చూసుకుంటే కాస్తో కూస్తో జైలర్ సినిమాలో కంటే భోళా శంకర్ సినిమాలో ఎక్కువ టైం కనిపించిన ఆమె పాత్రకు మాత్రం ఏమాత్రం ప్రాధాన్యత లేకుండా పోయింది.

కేవలం రెండు, మూడు కామెడీ సీన్స్, మరియు పాటలకు మాత్రమే తమన్నా క్యారెక్టర్ పరిమితమైంది. ఇన్నిరోజులుగా తమన్నా ఈ రెండు సినిమాలతో నైనా మళ్ళీ టాలీవుడ్ లో బ్రేక్ వస్తుందనుకుంటే అలా జరిగేలా లేదు. ఈ ప్రకారంగా చూసుకుంటే జైలర్ సినిమా తీసిన నెల్సన్, భోళా శంకర్ సినిమా తీసిన మెహర్ రమేష్ ఇద్దరి చేతిలో తమన్నా  మోస పోయిందనే చెప్పాలి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు