Rashmika Mandanna: ఛాన్స్‌ల కోసం మరింత దిగజారుతున్న నేషనల్ క్రష్

కన్నడ చిత్ర పరిశ్రమలో ఎక్కడో చిన్న చిన్న సినిమాలు చేసుకుంటున్న రష్మిక మందన్నా, ప్రస్తుతం నేషనల్ క్రష్ గా దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. దీనికి కారణం తెలుగులో ఈమెకు వచ్చిన విజయాలే అని చెప్పొచ్చు. టాలీవుడ్ లో ఛలో సినిమాతో అడుగుపెట్టిన ఈ కన్నడ బ్యూటీ, తెలుగు ప్రేక్షకులు ఓన్ చేసుకోవడానికి ఎంతో టైం పట్టలేదు. నిజానికి ఫస్ట్ సినిమాతోనే తెలుగు ఆడియన్స్ మనసులను దోచుకుంది ఈ బ్యూటీ. దీని తర్వాత గీతా గోవిందం, డీయర్ కామ్రెడ్, సరిలేరు నీకెవ్వరు వంటి సినిమాలు హిట్ తో టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అయిపోయింది.

ఇటీవల అల్లు అర్జున్ తో చేసిన పుష్ప సినిమాతో ఈ కన్నడ ముద్దుగుమ్మ, నేషనల్ క్రష్ అయిపోయింది. అప్పటి నుంచే ఈమెను నేషనల్ క్రష్ రష్మిక మందన్నా అంటున్నారు. అయితే రష్మిక ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో అతిగా గ్లామర్ షో ఉండదు. తెలుగుదనం కొట్టిపడేలా, నిండుగా చీరతో కనిపిస్తుంది. మోడ్రన్ డ్రెస్ లు వేసినా, కాస్త పద్దతిని మెయింటెన్ చేస్తుంది. ఈ బ్యూటీ ఇటీవల బాలీవుడ్ లో అడుగు పెట్టింది. అక్కడ కూడా అతి గ్లామర్ షోకి వెళ్లలేదు.

కానీ, ఇప్పుడు ఈ బ్యూటీ బాలీవుడ్ లో బికినీపై నటించడానికి రెడీ అవుతుందని రూమర్స్ వస్తున్నాయి. ఈ వార్తలు నేషనల్ క్రష్ ఫ్యాన్స్ కు ఏ మాత్రం మింగుడు పడటం లేదు. ఛాన్స్ లు రాకుంటే, నటన, ఫిట్ నెస్ పై ఫోకస్ చేయాలి కానీ, ఇలా బికినీలో నటించాల్సిన ఖర్మేంటి అంటూ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

నిజానికి రష్మిక మందన్నా, సౌత్ ని వదిలేసి, బాలీవుడ్ లోనే సెటిల్ అవ్వాలని అనుకుంది. కానీ, అక్కడ వరుసగా చేసిన సినిమాలన్నీ కూడా డిజాస్టార్ కావడంతో అవకాశాలు రోజు రోజుకు సన్నగిల్లుతున్నాయి. దీంతో బికినీ వేసి, నార్త్ ఆడియన్స్ ను తన బుట్టలో వేసుకోవాలని ప్లాన్ చేస్తుందని టాక్ వినిపిస్తుంది. అయితే బికినీతో నేషనల్ క్రష్ వలలో నార్త్ ఆడియన్స్ పడతారు కావొచ్చు. కానీ, సౌత్ లో ఈమెకు ఉన్న క్రేజ్ మాత్రం గోవిందా గోవింద…

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు