Ugram: ఉగ్రం కి నరేష్ ఇమేజ్ ప్లస్ అయ్యిందా..?

కామెడీ సినిమాలకు స్వస్తి చెప్పిన అల్లరి నరేష్ వరుసగా సీరియస్ కథాంశం ఉన్న సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ కనకమేడల దర్శకత్వంలో నరేష్ హీరోగా నటించిన ఉగ్రం సినిమా మే 5న విడుదలై డీసెంట్ టాక్ ని సొంతం చేసుకుంది. మిస్సింగ్ కేసుల మిస్టరీని ఛేదించే పోలీస్ క్యారెక్టర్లో నరేష్ నటనకు ప్రశంసలు అందుతున్నాయి. మార్నింగ్ షోకి మిశ్రమ స్పందన వచ్చిన ఈ సినిమాకి ఈవినింగ్ షో సమయానికి ఆక్యుపెన్సీ పెరిగింది. పోటీగా వచ్చిన గోపీచంద్ రామబాణం సినిమాకు నెగిటివ్ టాక్ రావటం ఒక కారణం అయితే, నరేష్ కి ఇండస్ట్రీలో క్లీన్ ఇమేజ్ ఉండటం కూడా ఉగ్రం సినిమాకి ఆదరణ పెరగటానికి కారణం అని చెప్పచ్చు.

హీరోకి ఉన్న ఇమేజ్ సినిమా రిజల్ట్ పై ప్రభావం చూపుతుందని నిస్సందేహంగా చెప్పవచ్చు. గతంలో చాలా సినిమాల విషయంలో ఇది ప్రూవ్ అయ్యింది కూడా. హీరోకి ఉన్న నెగిటివ్ ఇమేజ్ వల్ల యావరేజ్ కంటెంట్ ఉన్న సినిమాలు కూడా డిజాస్టర్స్ అయ్యాయి. అదే విధంగా హీరోకి ఉన్న పాజిటివ్ ఇమేజ్ కారణంగా యావరేజ్ గా మిగలాల్సిన సినిమాలు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి.ఉగ్రం సినిమా విషయంలో కూడా నెగిటివ్స్ ఉన్నప్పటికీ నరేష్ కి ఇమేజ్ కారణంగా అవేవి ఓపెనింగ్స్ పై ప్రభావం చూపలేకపోయాయి.

తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా 1.45 కోట్ల గ్రాస్ సాధించిన ఈ సినిమా లాభాల బాట పట్టాలంటే 5.77కోట్ల వసూళ్లు సాదించాలి. నెక్స్ట్ వీక్ వరకు సినిమాలేవీ లేకపోవటం, రామబాణం కి నెగిటివ్ టాక్ వచ్చింది కాబట్టి ఉగ్రం సినిమాకి కలెక్షన్స్ పెరిగే అవకాశం కనిపిస్తోంది. సెలవుల సీజన్ కూడా కలిసొస్తే నరేష్ కి బ్లాక్ బస్టర్ అందుకునే అవకాశం ఉంది. తోలి రోజు డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ఉగ్రం, ఇదే జోరు కంటిన్యూ చేస్తుందా లేదా చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు