Mrunal thakur : ఇకపై అలాంటి పాత్రలపై మృణాల్ ఫోకస్.. కానీ బాలీవుడ్ లో వేరే?

Mrunal thakur : టాలీవుడ్ లో ఇప్పుడున్న టాలెంటెడ్ హీరోయిన్లలో మృణాల్ ఠాకూర్ ఒకరు. బాలీవుడ్ లో సీరియల్స్ లో నటిస్తూ సినిమాల్లోకి వచ్చిన ఈ హీరోయిన్ అసలైన గుర్తింపు తెచ్చుకుంది మాత్రం టాలీవుడ్ లోనే. రెండేళ్ల కింద సీతారామం వంటి క్లాసిక్ బ్లాక్ బస్టర్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత హాయ్ నాన్న, లేటెస్ట్ గా ఫ్యామిలీ స్టార్ లో నటించింది. అయితే బాలీవుడ్ లో పలు చిత్రాలు చేసినా, సక్సెస్ వచ్చినా తెలుగులో వచ్చినంత క్రేజ్ గాని గుర్తింపుగాని రాలేదు. అందుకే ఇక్కడ తక్కువ సినిమాలు చేసినా టాలీవుడ్ లోనే ఎక్కువ సందడి చేస్తూ ఉంటుంది. రీసెంట్ గా ఫ్యామిలీ స్టార్ సినిమాతో వచ్చిన మృణాల్ ఆ సినిమాతో దారుణమైన ప్లాప్ అని అందుకుంది. అయినా మృణాల్ కెరీర్ కి వచ్చిన డోకా ఏమి లేదు. కానీ ఇప్పటివరకు చేసిన మూడు సినిమాల్లో కూడా ఒకే రకమైన పాత్రలు చేయడం వల్ల ప్రేక్షకులకు కూడా బోర్ కొట్టిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే మృణాల్ ఈ విషయంలో ఒక డెసిషన్ తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఇక పై అలాంటి పాత్రల్లో మృణాల్..

ఇక టాలీవుడ్ లో ఫ్యామిలీ స్టార్ తో హ్యాట్రిక్ హిట్ కొడదామనుకుని భారీ ప్లాప్ ని ఖాతాలో వేసుకుంది మృణాల్. అందుకే తన పాత్రల విషయంలో మృణాల్ (Mrunal thakur) ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. అది కూడా టాలీవుడ్ వరకే అని సమాచారం. ఇప్పటిదాకా చేసిన మూడు సినిమాల్లో మృణాల్ ఠాకూర్ బాగా డబ్బున్న పెద్ద పాత్రలే చేసింది. సీతారామంలో జమీందార్ వారసురాలిగా, నాని ని ప్రేమించే రిచ్ క్లాస్ గర్ల్ గా మెప్పించింది. ఇక ఫ్యామిలీ స్టార్ లో ఏకంగా వేల కోట్ల ఆస్తులున్న మిలియనీర్ గా దర్శనమిచ్చింది. అయితే పదే పదే ఇలాంటి క్యారెక్టర్లే చేయడం వల్ల బిసి సెంటర్ల ఆడియన్స్ కి, సామాన్య ప్రేక్షకులకు దూరమవుతూ వస్తుందేమో అని టాక్. పైగా టాలీవుడ్ లో క్లాస్ కంటే మాస్, ఫ్యామిలీ తరహా పాత్రలకే ఇంపార్టెన్స్ ఎక్కువ. అందుకే ఇక పై మిడిల్ క్లాస్ పాత్రలు, చిన్న ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న పాత్రలు చేయాలనీ భావిస్తోందట. ఓవరాల్ గా పక్కింటి అమ్మాయి వేషాలకు వచ్చేయాలి. అప్పుడే కనెక్టివిటీ ఇంకా పెరుగుతుంది. అయితే ప్రస్తుతం మృణాల్ కొత్తగా ఒప్పుకున్న తెలుగు ప్రాజెక్ట్ లు ఏమి లేవు. కానీ హను రాఘవపూడి చేయబోయే ప్రభాస్ సినిమాలో తననే తీసుకోవచ్చనే టాక్ వస్తుంది.

బాలీవుడ్ లో మాత్రం ఇలా కాదు..

అయితే మృణాల్ ఠాకూర్ టాలీవుడ్ లో మిడిల్ క్లాస్ హీరోయిన్ లా నటించాలని వార్తలు వస్తున్నా, అది టాలీవుడ్ వరకే పరిమితమని సమాచారం. బాలీవుడ్ లో ఇలాంటి పాత్రలు చేసినా కూడా, అక్కడ గ్లామర్ షో చేసే దాకా మేకర్స్ ఊరుకోరు అని టాక్ ఉంది. పైగా కెరీర్ మొదట్లో మృణాల్ సినిమాల్లో ఇలాంటి పాత్రలే వేసింది. బాలీవుడ్ లో సూపర్ 30, అలాగే మరాఠి మూవీ విట్టి దండు సినిమాలో లౌ క్లాస్ అమ్మాయిగా నటించి మెప్పించింది. మరి టాలీవుడ్ లో ఏ దర్శకుడు మృణాల్ అని మళ్లీ అలాంటి చిన్న తరహా పాత్రల్లో చూపిస్తాడో చూడాలి. ఇక మృణాల్ ప్రస్తుతం పూజ మేరీ జాన్ అనే చిత్రంలో అలాగే మరో తమిళ్ సినిమాలో నటిస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు