NTR: బాలీవుడ్ ఎంట్రీ సిద్ధం

నిన్ను చూడాలని సినిమాలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఎన్టీఆర్ అయితే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ కి గురైంది. ఆ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి చేసిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో మంచి గుర్తింపును సాధించుకొని హీరోగా ఇండస్ట్రీలో నిలబడ్డాడు. వివి వినాయక్ దర్శకత్వంలో చేసిన ఆది సినిమా ఎన్టీఆర్ కి మంచి స్టార్డం తీసుకొచ్చి పెట్టింది. అయితే ఎన్టీఆర్ ఎన్ని సినిమాలు చేసినా కూడా ఎస్ఎస్ రాజమౌళి ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించాయి.

వరుసగా హిట్ సినిమాలు అందుకని వెళ్తున్న తరుణంలో ఒక పేజ్ లో ఎన్టీఆర్ కి వరుసగా డిజాస్టర్ సినిమాలు కూడా పడ్డాయి. ఒక డైరెక్టర్ బ్లాక్ బస్టర్ కొడితే ఆ డైరెక్టర్ తో సినిమా చేయడం మొదలు పెట్టేవాడు అప్పట్లో ఎన్టీఆర్. బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో వచ్చిన సినిమా సింహ. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయం సాధించింది. ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీను తో దమ్ము అనే సినిమా చేశాడు ఎన్టీఆర్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది.

అలానే హీరో రామ్ తో కందిరీగ అనే సినిమా చేసి మంచి హిట్ అందుకున్నాడు దర్శకుడు సంతోష్. ఎన్టీఆర్ అప్పుడు సంతోష్ ను పిలిచి రభస సినిమాను చేశాడు ఆ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది. గబ్బర్ సింగ్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న హరీష్ శంకర్ తో సినిమా చేశాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ చేసిన రామయ్య వస్తావయ్య సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఇలా హిట్ డైరెక్టర్ తో ఎన్టీఆర్ చేసిన ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గానే మిగిలింది.

- Advertisement -

ఇక కొంతకాలం పోయిన తర్వాత ఫ్లాప్ డైరెక్ట్ లతో సినిమాలు చేయడం మొదలుపెట్టాడు ఎన్టీఆర్. వరుస ప్లాపుల్లో ఉన్న పూరి జగన్నాథ్ తో టెంపర్ అని సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. మిమ్మల్ని సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాతో ప్లాప్ అందుకున్న బాబి తో సినిమా చేసి జై లవకుశ తో మంచి హిట్ కొట్టాడు. అజ్ఞాతవాసి సినిమాతో డిజాస్టర్ మూట కట్టుకున్న త్రివిక్రమ్తో సినిమా చేసి అరవింద సమేత వీర రాఘవ తో మంచి హిట్టు కొట్టాడు. అలానే నేనొక్కడినే సినిమాతో డిజాస్టర్ అందుకున్న సుక్కుతో నాన్నకు ప్రేమతో సినిమా చేసి అద్భుతమైన ఘన విజయాన్ని అందుకున్నాడు.

లేకపోతే ప్రస్తుతం కొరటాల శివతో దేవర అనే సినిమాను చూస్తున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. దేవర సినిమాకి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఒక వీడియో టీజర్ కూడా రిలీజై ప్రేక్షకులకు అంచనాలను పెంచింది. అక్టోబర్ నెలలో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.

ఇకపోతే ఎన్టీఆర్ వార్2 షూటింగ్ లో జాయిన్ అవబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఈ సినిమాలో హృతిక్ రోషన్ తో పాటు ఎన్టీఆర్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే ఎన్టీఆర్ ఈ సినిమాలో ఒక రా ఏజెంట్ గా కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ త్వరలో ముంబైలో జరగనుంది. ఈ సినిమా షూటింగ్ లో ఎన్టీఆర్ పాల్గొనడానికి సిద్ధపడుతున్నట్లు విశ్వసినీయ వర్గాల సమాచారం వినిపిస్తుంది. ఈ సినిమాను అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు