Abhinav Gomatam: అనసూయ అంటే టార్చర్..!

Abhinav Gomatam.. ఒకప్పుడు ప్రముఖ కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకొని.. ఇటీవలే “మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా” అనే సినిమాతో హీరోగా మారిన అభినవ్ గోమటం గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఒకవైపు కమెడియన్ గా పలు చిత్రాలలో నటిస్తూనే.. మరొకవైపు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ మరింత పేరు దక్కించుకున్నారు.. ఇక ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న కమెడియన్ గా పేరు దక్కించుకున్న అభినవ్ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ పలు విషయాలను వెల్లడిస్తున్నారు..

జనరేషన్ కి తగ్గ కమెడియన్..
సాధారణంగా ఎవరైనా సరే ఫుల్ ఫ్రస్టేషన్ లో ఉన్నప్పుడు రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, బాబూ మోహన్ సినిమాలను పెట్టుకొని మరీ చిల్ అవుతూ ఉంటారు. అయితే ఈ జనరేషన్ లో ఆ జనరేషన్ వాళ్లకు టైం అయిపోయింది.. ఇప్పటి జనరేషన్ వాళ్ళ కోసం ముఖ్యంగా యంగ్ కమెడియన్స్ ఎంతోమంది వచ్చేశారు.. వారిలో అభినవ్ గోమటం, ప్రియదర్శి లాంటి వాళ్ళను చూస్తే ఆటోమేటిక్గా నవ్వొచ్చేస్తుంది. ముఖ్యంగా వీరు నటించిన సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ ఎన్నిసార్లు చూసినా సరే మళ్లీ మళ్లీ చూడాలనిపించే అంత కామెడీతో నటనతో అద్భుతంగా తమ ప్రతిభను కనబరిచారు..

అనసూయ అంటేనే టార్చర్..
ఇకపోతే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న అభినవ్ గోమటంతో ఇంటర్వ్యూ చేసింది రీతూ చౌదరి.. దావత్ నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ కి అభినవ్ గెస్ట్ గా వచ్చారు.. ఇంటర్వ్యూలో భాగంగా రీతూ చౌదరి మాట్లాడుతూ.. “పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? ఊరికే అడుగుతున్నా” అనేసరికి..” నువ్వు రెడీనా.. నన్ను పెళ్లి చేసుకోవడానికి.. అయినా ఊరికే నా పెళ్లి గురించి ఎందుకు అడుగుతున్నావ్.. ఒకవేళ యాంకర్ కాకపోయి ఉంటే నువ్వు ఏం చేసేదానివి?” అని రీతూని అభినవ్ అడిగేసరికి “డైరెక్టర్ అయ్యేదాన్నేమో “అంటూ చెప్పింది రీతూ చౌదరి..

- Advertisement -

ఇక తర్వాత మ్యాచ్ ది ఫాలోయింగ్ అంటూ ఒక క్విజ్ రీతూ చౌదరి నిర్వహించగా.. దాంట్లో అభినవ్ మాట్లాడుతూ.. “ఇంకా టార్చర్ ఒకటే మిగిలింది.. అది అనసూయకు ఇచ్చేస్తున్నా.. అనసూయ ఏమీ అనుకోకు.. యూ ఆర్ టార్చర్డ్ ” అని చెప్పాడు అభినవ్.. నెక్స్ట్ థంబ్ నైల్ , నెక్స్ట్ లైవ్ మీ గురించే అంటూ రీతూ కూడా అనసూయ ను ఉద్దేశించి మాట్లాడింది.. ఇక తర్వాత రీతూ అడిగే ప్రశ్నలకి వరుసగా సమాధానాలు చెప్పిన అభినవ్.. చివరికి ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు సన్నీలియోన్ ది ప్రీవియస్ వర్క్ చూసేవాడిని అని చెప్పేసరికి … రీతు చౌదరికి ఏం అర్థమైందో కానీ పడి పడి నవ్వేసింది.. ఇక అభినవ్ కూడా నవ్వుకుంటూ.. నాతో ఉండి చెడిపోయేదేమో కానీ వీళ్ళతో ఉండి ఇప్పుడు నేను చెడిపోతున్నాను అంటూ రీతూ చౌదరిని ఉద్దేశించి అభినవ్ కామెంట్లు చేశారు.. మొత్తానికి అయితే అభినవ్ ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్ గా మారుతోంది.

విశ్వక్ సేన్ పై కామెంట్స్..
ఇకపోతే ఒకసారి విశ్వక్ సేన్ బర్తడే కి వాళ్ళ ఫ్రెండ్ ఒక కేక్ తెచ్చారు.. అది కాస్త ఫిమేల్ షేప్ లో ఉండేసరికి అది తినాలా వద్దా అంటూ భయపడ్డాను అని తడబడుతూ చెప్పారు. మొత్తానికైతే అభినవ్ చేసిన ఈ కామెంట్ లు వైరల్ గా మారుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు