Geethanjali malli vachindi Twitter review: గీతాంజలి మళ్లీ వచ్చింది.. ట్విట్టర్ రివ్యూ..!

Geethanjali malli vachindi Twitter review: ప్రముఖ డైరెక్టర్ కోన వెంకట్, ప్రముఖ హీరోయిన్ అంజలి కాంబినేషన్లో వచ్చిన కామెడీ హార్రర్ చిత్రం గీతాంజలి.. చాలామంది కమెడియన్లకు ఈ సినిమా బాగానే ప్లస్ అయింది.. మళ్ళీ పదేళ్ల తర్వాత గీతాంజలి మళ్లీ వచ్చింది అంటూ గీతాంజలి సినిమా సీక్వెల్ ను తెరకెక్కించారు. ఇక ఈరోజు ఈ సినిమా ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు రాగా.. ఆల్రెడీ ఓవర్సీస్ లో షోలు పడ్డాయి. మరి ట్విట్టర్ ద్వారా ఓవర్సీస్ లో సినిమా చూసిన ఆడియన్స్ ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.. మరి “గీతాంజలి మళ్లీ వచ్చింది” సినిమా సక్సెస్ అయ్యిందా? లేదా? అనే విషయం తెలియాలి అంటే.. ట్విట్టర్ ద్వారా ఆడియన్స్ ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం..

ఇకపోతే ఫస్ట్ ఆఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుందని ఇందులో ఫన్ అదిరిపోయిందంటూ కామెంట్లు చేస్తున్నారు.. హార్రర్ కామెడీ కాన్సెప్ట్ బాగానే వర్కౌట్ అయిందట.. ముఖ్యంగా తకిట తదిమి అంటూ తెగ నవ్వేసుకుంటున్న ఏమోజీలను కూడా షేర్ చేస్తున్నారు. ఇకపోతే డీసెంట్ కామెడీ హర్రర్ అని, ఫస్ట్ హాఫ్ లో కొన్ని లాగ్ సీన్స్ తప్ప చాలావరకు ఎంటర్టైన్ చేశారని, కమెడియన్స్ కాస్టింగ్ అదిరిపోయిందని చెబుతున్నారు.. అంతేకాదు సునీల్ కి మంచి కం బ్యాక్ అని కూడా చెబుతున్నారు..

మొత్తానికి ట్విట్టర్లో స్టార్ హీరోల సినిమాలకుండే హడావిడి లేకపోయినా.. అంజలి 50వ సినిమాకి పాజిటివ్ టాక్ కనిపిస్తోంది.. కనిపించిన రెండు మూడు ట్వీట్స్ అయినా కాస్త పాజిటివ్ గానే ఉన్నాయి అంటూ సినిమాకి మరీ అంత నెగటివ్ టాక్ రాకపోయినా.. గొప్పగా ఉందనే ప్రశంసలు దక్కకపోయినా.. చెత్తగా ఉందనే విమర్శలు మాత్రం రావేమోననిపిస్తోంది.. పూర్తి రివ్యూ రావాలి అంటే మరో మూడు నాలుగు గంటలు ఎదురు చూడాల్సిందే..

- Advertisement -

ఇకపోతే ఫైనల్ గా సినిమా ఎలా ఉంది? ప్లస్, మైనస్ లు ఏంటి అనే విషయానికి వస్తే..
సినిమాకు సానుకూల అంశాలు:
మొదటి భాగం కంటే రెండవ భాగంలో 15 నిమిషాల కమెడియన్ల సందడి సినిమాకి హైలెట్గా నిలవబోతోంది. ముఖ్యంగా దర్శకుడు కోన వెంకట డైలాగ్స్ అదిరిపోయాయి. ఇంటర్వెల్ అలాగే క్లైమాక్స్ భాగాలు సినిమాకి విజయాన్ని అందిస్తాయి అనడంలో సందేహం లేదు.

సినిమా యొక్క ప్రతికూలతల విషయానికి వస్తే..
కథను తెరకెక్కించే విధానం ప్రేక్షకులను పెద్దగా ఆసక్తి పరచలేదు.. బలహీనమైన కథాంశం , పాత్రలు.. ఊహించదగిన స్క్రీన్ ప్లే.. సినిమాకు నెగిటివ్గా మారుతున్నాయి.. అలాగే సాంగ్ సెలక్షన్ తో పాటు ప్లేస్మెంట్ కూడా సరిగ్గా లేదు.. వీ ఎఫ్ ఎక్స్ కూడా అంతంత వరకు మాత్రమే ప్రేక్షకులను మెప్పిస్తుంది.. ఇకపోతే టైంపాస్ సినిమా అని ఇందులో కొత్తదనం ఏమీ లేదని ఆడియన్స్ చెబుతున్నారు.. మొత్తానికైతే కామెడీ తోనే ఈ సినిమా పరవాలేదు అనిపించుకుంటుందనటంలో సందేహం లేదు. తెలుగమ్మాయి గీతాంజలి ఇప్పుడు ఈ సినిమాతో ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు