Siddhu Jonnalagadda: రామ్ చరణ్ స్వీట్ హార్ట్ పర్సన్

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అందరూ అన్నయ్య అని పిలుచుకొని స్టార్ మెగాస్టార్ చిరంజీవి. అదే మెగాస్టార్ చిరంజీవి వారసుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు అంటే అంచనాలు ఏ విధంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే వాటన్నిటి మధ్య బీభత్సమైన అంచనాలతో చిరుత సినిమాతో తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్ తేజ్. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించింది. మొదటి సినిమాతోనే చిరు తనయుడు అనిపించుకున్నాడు చరణ్. అలానే తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి మంచి హీరో దొరికాడు అని ప్రశంసలు కూడా అందుకున్నాడు.

రామ్ చరణ్ చేసిన రెండో సినిమా మగధీర. సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది తెలుగు సినిమా చరిత్రలో ఆల్ టైం రికార్డ్ సృష్టించింది ఈ సినిమా. తన రెండవ సినిమాకే స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు రామ్ చరణ్. అయితే ఆ తరుణంలో రాంచరణ్ పైన ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి. బయట కొద్దిపాటి వివాదాలు కూడా జరిగాయి. అయితే రామ్ చరణ్ ఆ రోజుల్లో నడుచుకునే తీరు వేరు. ఇప్పుడు రామ్ చరణ్ వేరు. అప్పుడు కూడా రామ్ చరణ్ స్వీట్ హార్ట్ పర్సన్. కానీ ఒక ఇష్యూ పై సామాన్యుడు ఎలా రియాక్ట్ అవుతాడో అలా రియాక్ట్ అయ్యేవాడు చరణ్.

అలానే నాయక్ ఆడియో లాంచ్ లో కూడా అగ్రేసివ్ గా బిహేవ్ చేయటం. ఇవన్నీ కూడా చరన్ అభిమానులకి చాలా నచ్చాయని చెప్పొచ్చు. అప్పటితోనే చరణ్ చాలా జెన్యూన్ గా ఉంటాడని కూడా చాలామందికి అర్థం అయింది. అయితే రీసెంట్ టైమ్స్ లో చరణ్ కొన్నిటిని పట్టించుకోవడం మానేశాడు. పాజిటివ్ గా ముందుకెళ్ళిపోతున్నాడు. దీని కారణం చరణ్ సాధించిన స్టార్ డం. ఇంత స్టార్ డం వచ్చిన తర్వాత కూడా దేనికి పడితే దానికి స్పందిస్తే స్పందించడం కరెక్ట్ కాదు అంటూ బిలీవ్ చేస్తూ ముందుకు వెళ్లిపోతున్నాడు.

- Advertisement -

ఇకపోతే రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ అయిపోయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును సాధించుకున్నాడు రామ్ చరణ్ తేజ్. ఇకపోతే జీవితంలో ఇంత స్టేజ్ కి వెళ్ళినా కూడా చరణ్ ఇప్పటికీ యంగ్ హీరోస్ కి, కొత్త టాలెంట్ కి, కొత్త సినిమాలకి తనవంతు సహాయాన్ని అందిస్తూనే ఉంటాడు. ఇకపోతే రీసెంట్ గా రిలీజ్ అయిన టిల్లు స్క్వేర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా గురించి రాంచరణ్ ట్విట్టర్ వేదిక స్పందించాడు.

సిద్దు జొన్నలగడ్డను మెన్షన్ చేస్తూ టిల్లు స్క్వేర్ సినిమా మంచి హిట్ అయినందుకు టీమ్ అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు రామ్ చరణ్. అయితే ఒక సినిమా సక్సెస్ అయినప్పుడు ఒక స్టార్ హీరో ఇలా కంగ్రాట్స్ చెప్పడం అనేది రేర్ గా జరుగుతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా చాలా సినిమాలకు ఇలానే చెప్తూ ఉంటారు. ఇకపోతే చరణ్ సినిమాకు టిల్లు సినిమాకు కంగ్రాట్స్ చెప్పడం పై సిద్దు జొన్నలగడ్డ రియాక్ట్ అయ్యారు.

రామ్ చరణ్ గురించి సిద్దు స్పందిస్తూ కొన్ని మాటలు రాసుకొస్తూ రామ్ చరణ్ ని స్వీట్ పర్సన్ అంటూ ఇంస్టాగ్రామ్ స్టోరీ వేదికగా చెప్పుకొచ్చాడు సిద్దు. టిల్లు స్క్వేర్ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయింది. వారం రోజుల్లోనే సినిమా 100 కోట్లు మార్కెట్ ను దాటింది. ఒక మిడ్ రేంజ్ హీరో 100 కోట్లు మార్కెట్ సినిమా చేయటం అనేది మామూలు విషయం కాదు. ఇకపోతే ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోస్ లో సిద్దు జొన్నలగడ్డ ఒక సెన్సేషన్ అని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు