Spark: తీసిందే రొట్ట సినిమా అంటే.. మళ్ళీ వంద తగ్గించామని బిల్డప్ లు?

టాలీవుడ్ లో ఈ వారం రిలీజ్ అయిన చిన్న సినిమాల్లో “స్పార్క్” ఒకటి. విక్రాంత్ రెడ్డి అనే కొత్త హీరో ఈ సినిమాలో నటించి నిర్మించడమే గాకుండా దర్శకత్వం వహించాడు. నవంబర్ 17న రిలీజ్ అయిన స్పార్క్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అయితే భారీ బడెజ్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి మూవీ మేకర్స్ ప్రమోషన్స్ కూడా బాగా చేసినా, జనాలకి రీచ్ కాలేకపోయింది.

స్పార్క్ సినిమా ఆక్షన్ డ్రామా గా తెరకెక్కగా, సినిమా ఏమాత్రం అంచనాలు అందుకోలేకపోగా ట్రోలింగ్ కి గురవుతుంది. ఈ సినిమాలో హీరో ఎక్స్ప్రెషన్స్ కి చాలా ఫీల్ అయిపోయిన జనాలు థియేటర్లో ఏడవడం ఇష్టం లేక ఇంటికెళ్లి ఏడుస్తున్నారు. అందుకే ఆడియన్స్ ని మళ్ళి థియేటర్లకు రప్పించడానికి మూవీ మేకర్స్ గట్టి ప్లాన్ వేశారు. రిలీజ్ అయిన తరువాత రోజు నుండే థియేటర్లలో వంద రూపాయల దాకా రేటు తగ్గిస్తున్నామని, సింగల్ స్క్రీన్ , మల్టీ ప్లెక్స్ థియేటర్ల రేటు తగ్గించి పోస్టర్స్ లో చూపిస్తున్నారు.

అయితే ఇదంతా చూస్తున్నసినీ ప్రియులు తీసింది రొట్ట సినిమారా బాబు అంటుంటే, రేట్లు తగ్గించామని ఎందుకు ఈ బిల్డప్ లు అంటూ ఆడియన్స్ అంటున్నారు. ఇప్పటికే హీరో యాక్టింగ్ విషయం లో ట్రోలింగ్ స్టార్స్ లో టాప్ కి వెళ్ళాడు. ఇప్పుడు ఇలాంటి చెత్త ప్రమోషన్స్ తో జనాలని ఇంకా ఆక్ట్రాక్ట్ చేయాలని చూడొద్దని సోషల్ మీడియా లో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు