Nivetha thomas: ఆ జబ్బువల్లే నాని హీరోయిన్ టాలీవుడ్ కు దూరమైందా?

టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని బ్యూటీ నివేదా థామస్. ప్రస్తుతం ఈ అమ్మడికి తెలుగులో అవకాశాలు కరువయ్యాయి. అయితే తాజాగా వినిపిస్తున్న మరో వెర్షన్ ప్రకారం నివేదా థామస్ఓ జబ్బుతో బాధపడుతోందని, అందుకే తనకు వస్తున్న అవకాశాలను తిరస్కరిస్తుందని అంటున్నారు.

నేచురల్ స్టార్ నానితో ‘జెంటిల్మెన్’, ‘నిన్ను కోరి’, ‘వి’ వంటి సినిమాలతో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో “జై లవకుశ” అనే సినిమాల్లో నటించి కెరీర్ తొలినాళ్లలోనే టాలీవుడ్ లో హ్యాట్రిక్ హిట్ కొట్టింది నివేదా థామస్. ఇక ఈ హీరోయిన్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ల లిస్ట్ లో చేరిపోతుందని, ఆమెను ఆపడం ఎవరి తరమూ కాదని అనుకుంటున్న టైంలోనే నివేదకు అనూహ్యంగా ఆఫర్స్ తగ్గిపోయాయి.

అయితే మిడ్ రేంజ్ హీరోలా సరసన నటించే అవకాశాలు అయితే బాగానే వచ్చాయి. అందులో భాగంగానే జూలియట్ లవర్ అఫ్ ఇడియట్, 118, బ్రోచేవారెవరురా వంటి చిత్రాల్లో నటించింది.

- Advertisement -

ఆ సినిమాల్లో కొన్ని హిట్ అయినప్పటికీ నివేదా మాత్రం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ లో కూడా ఈ బ్యూటీ ఓ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. మరోవైపు తమిళ తంబీలు కూడా ఈ భామపై ఆసక్తి చూపించలేదు. దీంతో ‘శాకినీ ఢాకిని’ అంటూ మరో డిజాస్టర్ హీరోయిన్ రెజీనాతో లేడీ ఓరియెంటెడ్ జోనర్ ట్రై చేసింది. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది.

ఇలా ఇండస్ట్రీలోని చాలామంది స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న నివేదా థామస్ ఇప్పుడైతే ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. మంచి అవకాశాలు వస్తున్నప్పటికీ ఆమె ఇంట్రెస్ట్ చూపించట్లేదని అంటున్నారు. ప్రస్తుతం ఆమె బాగా బరువు పెరిగిపోవడమే అందుకు కారణమని సమాచారం. ముందు నుంచి మంచి ఆహార ప్రియురాలైన నివేదా నోటిని కంట్రోల్ చేసుకోకపోగా, మిగతా హీరోయిన్ల లాగా డైట్లు, వర్క్ అవుట్ లు చేయలేదట. తిన్నామా… పడుకున్నామా.. తెల్లారిందా? అన్నట్టుగా వ్యవహరించడంతో సడన్ గా లావైపోయిందట.

అంతేకాదు ఆమెకు థైరాయిడ్ సమస్య కూడా రావడంతో, బరువు తగ్గాలని ఎంత ప్రయత్నించినా నివేద వల్ల కావట్లేదట. ఇక థైరాయిడ్ ను అదుపులో ఉంచడం కోసం ప్రస్తుతం నివేదా మందులు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇండస్ట్రీలో మంచి మంచి మూవీ చాన్సులు వస్తున్నా, చేయలేకపోతున్నానే అంటూ నివేదా బాధ పడిపోతుందని వార్తలు వస్తున్నాయి. మరి ఈ బ్యూటీ ఎప్పుడు రీఎంట్రీ ఇస్తుందో చూడాలి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు