Nani: లెక్కలు తేల్చేసాడు , ప్రొడ్యూసర్స్ కూడా రియాక్ట్ అయ్యారు

నేచురల్ స్టార్ నాని ఈ పేరు గురించి ఇప్పుడు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రముఖ దర్శకులు బాపు గారి దగ్గర రాధాగోపాలం సినిమాకి క్లాప్ బోర్డు బాయ్ గా పనిచేసిన నాని అష్టా చమ్మా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక మంచి గుర్తింపును సాధించుకున్నాడు. నాని కెరియర్ లో ఇప్పటివరకు చేసిన సినిమాలన్నిటిలో ప్రేక్షకుడిని తీవ్రస్థాయిలో నిరాశపరిచిన సినిమా అంటూ ఏది లేదు అని చెప్పొచ్చు.

నాని మొదట్లో చేసిన సినిమాలు, నాని ఇప్పుడు చేస్తున్న సినిమాలు చూస్తుంటే నాని స్క్రిప్ట్ సెలక్షన్స్ లో ఎటువంటి మార్పు వచ్చింది అని ఈజీగా గమనించవచ్చు. నాని చేసిన రీసెంట్ గా చేసిన జెర్సీ, శ్యామ్ సింగ రాయ్ , అంటే సుందరానికి , దసరా సినిమాలన్నీ వేటికవే ప్రత్యేకమని చెప్పొచ్చు. ప్రస్తుతం నాని చేస్తున్న సినిమా “హాయ్ నాన్న” ఈ సినిమా టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయింది.

ఈ టీజర్ ఈవెంట్ లో సినిమా జర్నలిస్టుల నుండి నానికి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. ఒక ప్రముఖ జర్నలిస్ట్ నానిని ఒక క్వశ్చన్ వేశారు.
మీరు చేస్తున్న సినిమాలు వేటికవే ప్రత్యేకం, కానీ మీ సినిమాలకు డబ్బులు ఎందుకు రావట్లేదు, అని జెర్సీ మరియు శ్యామ్ సింగ రాయ్ సినిమా పేర్లను ప్రస్తావించారు.

- Advertisement -

వాటికి నాని తనదైన శైలిలో నవ్వుతూ సమాధానం ఇస్తూ, ఆయన అడిగిన ప్రశ్న కరెక్ట్ కాదు అని ఆయనకు తెలిసొచ్చేలా క్లారిటీ ఇచ్చాడు.
వాస్తవానికి ఆ సినిమాలు ప్రేక్షకులను బాగా అలరించాయి. జెర్సీ సినిమా విషయానికి వస్తే ఆ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది, ప్రొడ్యూసర్ గా తాను కూడా హ్యాపీ అని నాగవంశీ చాలా ఇంటర్వూస్ లో చెప్పాడు. శ్యామ్ సింగ రాయ్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలో పునర్జన్మ అనే కాన్సెప్ట్ ను తీసుకొని కథను అల్లిన విధానం.
ఆ కథ ప్రేక్షకుడిని ఆకట్టుకున్న విధానం ఇప్పటికీ ఎవరు మర్చిపోలేరు.

ఇకపోతే నాని “అంటే సుందరానికి” సినిమా కూడా చాలామందికి ఇప్పటికీ ఫేవరెట్ అని చెప్పొచ్చు. చాలా ఓపెన్ గా నాని ఆ సినిమా గురించి ప్రస్తావిస్తూ మీరు రెండు సినిమాలు ప్రస్తావించారు. అవి నిజంగా సేఫ్ జోన్ లో ఉన్నవే, మీరు అన్న మాట సాధారణ ప్రేక్షకుడు అంటే ఓకే గాని అన్నీ తెలిసిన మీరు అంటే మీరు అనడం కరెక్ట్ కాదు అని చాలా పద్ధతిగా ఇచ్చి పడేసాడు. ఇదే విషయాన్ని మీరు “అంటే సుందరానికి” అనే సినిమాకి ప్రస్తావించిన పరవాలేదు అంటూ చెప్పుకొచ్చాడు.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే వీటన్నిటికీ మించి ఏ సినిమాల గురించి అయితే ఆ ప్రముఖ జర్నలిస్టు ప్రస్తావించాడో ఆయా సినిమాల ప్రొడ్యూసర్స్ ట్విట్టర్ వేదికగా ఆ సినిమాలు యొక్క గొప్పతనాన్ని, ఆ సినిమాలు తమని నిలబెట్టిన స్థానాన్ని చెప్పుకుంటూ వచ్చారు. మంచి సినిమాలను సెలెక్ట్ చేసుకోవడమే కాకుండా ఆయా సినిమా ప్రొడ్యూసర్లకు కూడా ఒక సంతృప్తిని ఇచ్చి తనకంటూ ఉన్న గౌరవాన్ని అలా నిలబెట్టుకోవడమే నాని లో ప్రత్యేకత మరోమారు రుజువైంది.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు