Thalapathy 68 : విజయ్ కు నో చెప్పి ధమ్కీ ఇచ్చిన లవ్ టు డే హీరోయిన్

దళపతి అని తమిళ తమ్ముళ్లు ముద్దుగా పిలుచుకునే తమిళ స్టార్ హీరో విజయ్ కి ఒక అప్ కమింగ్ హీరోయిన్ ధమ్కీ ఇచ్చిందట. ఏకంగా విజయ్ సినిమాను రిజెక్ట్ చేసి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది లవ్ టుడే హీరోయిన్.

విజయ్ నెక్స్ట్ మూవీ ఇప్పటికే ఫిక్స్ అయింది. ఆయన కెరీర్ లో ఇది 68వ మూవీ కాగా, ఇందులో మీనాక్షి చౌదరి ఇప్పటికే హీరోయిన్ గా ఫిక్స్ అయింది. ప్రముఖ తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ మూవీకి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ మూవీ కోసమే లవ్ టుడే హీరోయిన్ ను మేకర్స్ సంప్రదించగా ఆమె సున్నితంగా తిరస్కరించిందట. హీరోయిన్ ఇవానా అంటే చాలా మందికి తెలియదు. కానీ లవ్ టుడే హీరోయిన్ అనగానే అందరూ ఈజీగా గుర్తుపడతారు. ఆ సినిమా ఈ బ్యూటీకి అంత గుర్తింపు తీసుకొచ్చింది మరి. తమిళంలో ఈ మూవీ సూపర్ హిట్ కాగా దీన్ని తెలుగులో కూడా రీమేక్ చేశారు ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి యూత్ కు బాగా దగ్గర అయింది ఇవానా. దీంతో ఈ బ్యూటీ కి అవకాశాలు వెల్లువలా వచ్చి పడతాయని అంతా అనుకున్నారు.

అనుకున్నట్టుగానే ఏకంగా విజయ్ సినిమాలో అవకాశం వచ్చింది. మరి అలాంటి అద్భుతమైన అవకాశాన్ని ఈ బ్యూటీ ఎందుకు చేజార్చుకుంది అంటే… నిజానికి విజయ్ మూవీ లో ఛాన్స్ అంటే హీరోయిన్లు ఎగిరి గంతేసినంత పని చేస్తారు. కానీ ఇవానా మాత్రం తిరస్కరించింది. ఆమె అలా చేయడానికి కారణం లేకపోలేదు. ఈ సినిమాలో ఇవానాకు ఆఫర్ వచ్చిన మాట నిజమే కానీ. అది హీరోయిన్ గా కాదట. విజయ్ కి చెల్లెలి పాత్రలో నటించే అవకాశం రావడంతో ఈ బ్యూటీ నో చెప్పిందట. ఒకసారి చెల్లెలి పాత్రలో నటిస్తే మళ్ళీ అలాంటి రోల్స్ వస్తాయి. హీరోయిన్ గా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఇలాంటి టైములో అలాంటి రిస్క్ తీసుకోవడం ఎందుకు అనే భయంతో ఇవానా ఈ భారీ మూవీలో అవకాశాన్ని రిజెక్ట్ చేసిందట.

- Advertisement -

దీంతో ఆమె అభిమానులు మంచి పని చేశావు అని ప్రశంసిస్తుంటే, మరికొంతమంది మాత్రం మంచి అవకాశాన్ని మిస్ చేసుకుంది అంటూ పెదవి విరుస్తున్నారు. కాగా ఈ బ్యూటీ ఇంకా టాలీవుడ్ మేకర్స్ దృష్టిలో పడలేదు. మరి ఈ అమ్మడికి టాలీవుడ్ లో ఎప్పుడు అవకాశం వస్తుందో చూడాలి.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు