Kiara advani: తల్లి కాబోతున్న యంగ్ బ్యూటీ..!

ఈ మధ్యకాలంలో నాటి సెలబ్రిటీలతో పోల్చుకుంటే ఇప్పటి సెలబ్రిటీలు అన్ని విషయాలలో కూడా వేగంగా దూసుకుపోతున్నారని చెప్పాలి. ఎంత త్వరగా అయితే క్రేజ్ సంపాదించుకుంటారో అంతే త్వరగా ఫేడ్ అవుట్ అవుతున్నారు. ఒక కెరియర్ విషయంలోనే కాదు వ్యక్తిగత జీవితంలో కూడా అంతే స్పీడ్ గా ఉన్నారనటంలో సందేహం లేదు.. ఈ క్రమంలోనే చాలామంది సెలబ్రిటీలు వేగంగా వివాహాలు చేసుకుని.. అంతే వేగంగా తల్లిదండ్రులతో అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ యంగ్ బ్యూటీ కూడా తల్లి కాబోతోంది అంటూ ఒక వార్త తెరపైకి రావడం గమనార్హం. అసలు విషయంలోకి వెళితే బాలీవుడ్ ఫిలిం సర్కిల్ లో యంగ్ బ్యూటీ కియారా అద్వానీ తల్లి కాబోతోంది అంటూ ఒక వార్త తెగ వైరల్ గా మారింది.

ఆన్ స్క్రీన్ రొమాన్స్ తో మతి పోగొట్టిన సిద్దార్థ్ మల్హోత్రా – కియారా అద్వానీలు గత ఏడాది ఫిబ్రవరి నెలలో వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. ఇక పెళ్లి జరిగిన దగ్గర్నుంచి కియారా అద్వానీ తల్లి కాబోతోంది అంటూ ఎప్పటికప్పుడు రూమర్లు షికార్లు చేశాయి. ఇదే క్రమంలో ఇప్పుడు మళ్లీ ప్రెగ్నెంట్ అయింది అంటూ వార్తలు రావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.. మరోవైపు కియారా అద్వానీ గర్భవతి అయిందని చెప్పడానికి ఆధారాలను కూడా చూపిస్తోంది బాలీవుడ్ మీడియా. తాజాగా ఒక చిన్న లాజిక్ చూబెడుతూ.. ఆమె ప్రెగ్నెంట్ అని నిరూపించే ప్రయత్నం చేస్తోంది.

ఇక అసలు విషయంలోకి వెళ్తే తాజాగా కియారా అద్వాని ఒక పోస్ట్ పెట్టిందని.. అందులో ఆమె చాలా లావుగా కనిపించిందని.. ఆ తర్వాత కొన్ని రోజులకు మరో వీడియో పెట్టిందని.. ఇక అందులో వదులుగా ఉండే సల్వార్ డ్రెస్ వేసుకుందని.. పైగా కియారా అద్వానీ నడక కూడా చాలా నెమ్మదిగా ఉందని.. ఈ రెండు వీడియోల ఆధారంగానే ఆమె ప్రెగ్నెంట్ అయింది అంటూ బాలీవుడ్ మీడియా కథనాలు అల్లేస్తోంది. సాధారణంగా ఇలాంటి విషయాలు దాచిపెడితే దాగేది కాదు.. కాబట్టి కచ్చితంగా త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుంది అనడంలో సందేహం లేదు..

- Advertisement -

కానీ సోషల్ మీడియాలో మాత్రం ఇలాంటి వార్తలు వైరల్ అవుతూ ఉండడం గమనార్హం . మరొకవైపు సోషల్ మీడియాలో కియారా కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. కాబట్టి ఈ విషయాల పై మాట్లాడడానికి ఆమె ఏమాత్రం మొహమాట పడదు.. గతంలోనే ఇలాంటి వార్తలు రావడంతో ఆమె సీరియస్ అయింది కానీ ఆ వార్తలు మళ్లీ రావడంతో దీనిపై కియారా ఎలా రియాక్ట్ అవుతుందో అని అభిమానులు సైతం ఎదురుచూస్తున్నారు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు