Harish Shankar : ఆ రెండు బిగ్ ప్రాజెక్ట్‌లు… చిరు తర్వాత ఎవరంటే…?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం చాలా రోజులుగా ఎదురు చూసిన హరీష్ శంకర్ ఎట్టకేలకు ఆయనను వదిలేసి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ లపై కాన్సంట్రేట్ చేస్తున్నారు. ముందుగా రవితేజతో మొదలు పెట్టిన హరీష్, ఆ తర్వాత రెండు బిగ్ ప్రాజెక్టులను లైన్లో పెట్టారు. అందులో ఒకటి మెగాస్టార్ చిరంజీవితో ఉండగా, రెండవ ప్రాజెక్ట్ బాలీవుడ్ బడా స్టార్ తో తెరకెక్కబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా హరీష్ శంకర్ తాజాగా వెల్లడించారు. మరి హరీష్ రూపొందించబోతున్న ఆ హిందీ మూవీలో హీరో ఎవరు? పవన్ కళ్యాణ్ “ఉస్తాద్ భగత్ సింగ్” ప్రాజెక్ట్ సంగతేంటి? అనే వివరాల్లోకి వెళితే…

ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో “మిస్టర్ బచ్చన్” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రవితేజ తాజా చిత్రం “ఈగల్” మూవీ సక్సెస్ మీట్ కు హరీష్ శంకర్ కూడా హాజరయ్యారు. ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ తాను నెక్స్ట్ రెండు పెద్ద సినిమాలు చేయబోతున్నట్టుగా ప్రకటించారు. అయితే అందులో ఒకటి చిరంజీవితో, మరొకటి బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో చేయబోతున్నాడని తెలుస్తోంది. వాస్తవానికి ముందుగా ఈ దర్శకుడు చిరు, బాలయ్యలతో సపరేట్ గా రెండు సినిమాలు చేయబోతున్నాడు అని టాక్ వచ్చింది.

కానీ చివరకు చిరు, సల్మాన్ లతో హరీష్ రెండు ప్రాజెక్టులు ఫైనల్ కాగా, ఇప్పుడవి పట్టాలెక్కడానికి రెడీగా ఉన్నాయి. ముందుగా చిరంజీవి, హరీష్ శంకర్ ప్రాజెక్ట్ విషయానికి వస్తే… ఇప్పటికే పవన్ తో “ఉస్తాద్ భగత్ సింగ్” మూవీ కోసం చాలా సమయాన్ని వేస్ట్ చేసుకున్న హరీష్ శంకర్ కు చిరు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ బాధ్యతలను అప్పగించారు. దీనికి డైరెక్టర్, రచయిత బివిఎస్ రవి కథ అందిస్తుండగా, హరీష్ శంకర్ దర్శకత్వం వహించబోతున్నారు. ఇక ఈ ప్రాజెక్టును చిరు కూతురు సుస్మిత, పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి నిర్మించబోతున్నారు.

- Advertisement -

చిరు తర్వాత హరి శంకర్ బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కొత్త సినిమాకు దర్శకుడిగా వ్యవహరించనున్నారు. గత ఏడాది సల్మాన్ ఖాన్ కోసం ఓ స్టోరీ పట్టుకుని ముంబైకి కాళ్ళు అరిగేలా తిరిగారు. ఇప్పుడు అది వర్కౌట్ అవుతున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి చాలా రోజులుగా ఖాళీగా ఉన్న ఈ దర్శకుడు రెండు బడా సినిమాలతో తన అభిమానులకు మంచి అప్డేట్ ఇచ్చాడు. ఇక పవన్ ఏపీలో ఎలక్షన్స్ పూర్తయిన తర్వాతే మళ్ళీ సినిమాలపై కాన్సన్ట్రేట్ చేయనున్నారు. అయితే ఆయన ముందుగా “ఓజీ”నే పూర్తి చేయబోతున్నట్లు సమాచారం. కాబట్టి హరీష్ శంకర్ “ఉస్తాద్ భగత్ సింగ్” మళ్లీ పట్టాలెక్కాలంటే చాలా సమయం పడుతుంది. అంతలోపు మెగాస్టార్ తో హరీష్ ఈ కొత్త ప్రాజెక్టును పూర్తి చేసేస్తాడు. ఆ తరువాత పవన్, సల్మాన్ లతో సినిమాలు స్టార్ట్ చేస్తాడు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు