Priyamani: భర్తతో గొడవలపై క్లారిటీ ఇచ్చిన ప్రియమణి..!

ఒకానొక సమయంలో టాలీవుడ్, బాలీవుడ్ సినీ ఇండస్ట్రీల్లో స్టార్ హీరోయిన్ గా రాణించి.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్న ప్రముఖ నటీమణి ప్రియమణి.. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కొత్తలో ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి.. నటిగా మంచి గుర్తింపు అందుకున్నది.. కెరియర్ సాఫీగా సాగుతున్న సమయంలోనే.. అంటే 2017లో ముస్తాఫా రాజ్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. వివాహం తర్వాత ఒక్కసారిగా ఇండస్ట్రీకి దూరం అయిన ఈమె.. తర్వాత బుల్లితెర పైన ప్రసారమయ్యేటువంటి పలు షోలలో జడ్జిగా వ్యవహరించి ప్రేక్షకులకు మళ్లీ దగ్గరయింది.

ఆ తర్వాత కొన్నేళ్ళకు పలు చిత్రాలలో కీలకమైన పాత్రలలో కూడా నటించి క్యారెక్టర్ ఆర్టిస్టుగా భారీ పాపులారిటీ అందుకుంది. బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోల చిత్రాలలో నటించింది ప్రియమణి. నాగచైతన్యతో గత ఏడాది కస్టడీ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన ప్రియమణి.. అప్పటినుంచి వరుసగా పలు చిత్రాలతో పాటూ వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది.ఈ క్రమం లోనే తాజాగా ప్రియమణి నటించిన భామా కలాపం-2 వెబ్ సిరీస్ కూడా ఈనెల 16వ తేదీన ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహ లో డైరెక్ట్ గా స్ట్రీమింగ్ కాబోతోంది.

ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియమణి.. తన భర్తతో జరిగిన గొడవలపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది.. భామాకలాపంలో గ్యాంగ్ స్టర్ ను అల్లాడించే వైలెంట్ పాత్రలో తాను కనిపించబోతున్నానని తెలిపింది. నిజజీవితంలో కూడా భర్తను భయపడతారా అనే ప్రశ్న యాంకర్ వేయగా.. ఈ విషయం పై ప్రియమణి స్పందిస్తూ.. తానే భర్తకు భయపడతానంటూ సమాధానాన్ని తెలియజేసింది.. అలాగే తాను భర్తకు ఎంత భయపడతానో అంతే భయపెడతానంటూ తెలిపింది.

- Advertisement -

అయితే వైలెన్స్ రూపంలో కాదని జీవితంలో కొన్ని సందర్భాలలో మనం భర్త మాట వినాలి..మన మాట భర్త కూడా వినాలనే ఫిలాసఫీ లో ఉంటానని తెలిపింది.. భార్య భర్తల మధ్య గొడవలు అనేవి సర్వసాధారణమని తెలియజేసింది ప్రియమణి.. అంతేకాకుండా అప్పుడప్పుడు తమ మీద పలు రకాల రూమర్స్ కూడా వినిపిస్తుంటాయి.. వాటిని పెద్దగా పట్టించుకోము అంటూ తెలిపింది.. ప్రస్తుతం ప్రియమణి చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. ఏదిఏమైనా ప్రియమణి తన భర్తతో ఎలాంటి గొడవలు లేవంటూ క్లారిటీ ఇచ్చింది.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు