Kiara – Sidharth: ఫైనల్‌గా పెళ్లి డేట్ ఫిక్స్ ?

బాలీవుడ్ నటి కియారా అద్వానీ, బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్ర గత కొన్ని రోజుల నుంచి ప్రేమలో ఉన్న సంగతి విధితమే. చాలా రోజుల నుంచి ఈ జంట రిలేషన్ షిప్ లో ఉంటున్నారు. వీరి ప్రేమ పెళ్లి వరకు కూడా వచ్చింది. ఇటీవల కియారా, సిద్ధార్థ్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు అంటూ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. గత ఏడాది డిసెంబర్ లోనే వీరి పెళ్లి అని అని ఒక సారి వార్తలు వచ్చాయి. తర్వాత న్యూయర్ కి ఈ ప్రేమ జంట ఒక్కటైవుతున్నారు అంటూ కూడా న్యూస్ వచ్చింది.

తాజాగా ఈ బాలీవుడ్ ప్రేమ జంట తమ పెళ్లి డేట్ ను ఫిక్స్ చేసుకున్నారు అంటూ మరోసారి వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నెల 6వ తేదీన ప్రేమ పక్షులు పెళ్లితో ఒక్కటవుతున్నారని బాలీవుడ్ వర్గాల్లో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. దీని కోసం కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్ర అంతా సిద్ధం చేసుకుంటున్నారని కూడా సమాచారం. ఇటీవల ఈ జంట బాలీవుడ్ లోనే ప్రముఖ డిజైనర్ ఇంటి దగ్గర కనిపించింది. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

పెళ్లి డేట్ ను ఫిక్స్ చేసుకున్న తర్వాతే, పెళ్లి దుస్తుల డిజైనింగ్ కోసం డిజైనర్ ఇంటికి వచ్చారని న్యూస్ వచ్చింది. ఏది ఏమైనా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ బాలీవుడ్ ప్రేమ పక్షులు ఈ వారంలో ఒక్కటి కాబోతున్నారని తెలుస్తోంది. ఈ నెల 6న పెళ్లి ఫిక్స్ చేశారని, మెహందీ, సంగీత్, పెళ్లి కార్యక్రమాలను రెండు రోజుల్లో పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారట. వీరి పెళ్లి రాజస్థాన్ లోని జైసల్మేర్ ప్యాలేస్ లో జరగనుందని టాక్. పంజాబీ సంప్రదాయం ప్రకారం, కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులకు పెళ్లికి ఆహ్వానం అందిందని తెలుస్తోంది. రిసెప్షన్ ముంబైలో గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారని గుస గుసలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

కాగా కియారా అద్వానీ బాలీవుడ్ లోనే ఎక్కువగా సినిమాలు చేస్తోంది. తెలుగులో తొలిసారి సూపర్ స్టార్ మహేష్ బాబుతో భరత్ అనే నేను అనే సినిమా చేసింది. తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో వినయ విధేయ రామ అనే చిత్రంలో నటించింది. తాజాగా మరోసారి రామ్ చరణ్ తో RC15 లో కలిసి నటిస్తోంది. దీనికి కోలీవుడ్ లోని ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నాడు.

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు