Varun Tej: మెగా ప్రిన్స్ పెళ్లి ఫిక్స్ ?

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే హీరోలతో ఒక పెద్ద క్రికెట్ టీం తయారు అవుది అని చెప్పవొచ్చు. రామ్ చరణ్ నుంచి వైష్ణవ్ తేజ్ దాక అందరు సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన వారే. అయితే ఈ మెగా ఫ్యామిలీ నుంచి ఒక హీరోయిన్ కూడా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. నాగా బాబు కూతురు నిహారిక కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. తర్వాత 2020లో పెళ్లి కావడంతో ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది.

తాజాగా మెగా ఇంట్లో మరో సారి పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. నాగ బాబు కుమారుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు తెలుస్తుంది. నాగబాబు ఈ వార్తను స్వయంగా ప్రకటించారు. “త్వ‌ర‌లోనే వ‌రుణ్ పెళ్లి ఉంటుంది. పెళ్లి కూతురు ఎవ‌రు? పెళ్లెప్పుడు? అనేది వ‌రుణ్ తేజ్‌స్వ‌యంగా చెబుతాడు“ అని నాగబాబు ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. కాగా వరుణ్ తేజ్ లవ్ మ్యారేజ్ చేసుకోబోతున్నాడని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇవి ఎంత వరకి నిజమో వరుణ్ నుంచే స్పష్టత రావాల్సిందే. ఇక మెగా కంపౌండ్ లో హీరోల పెళ్లీలు ఒకరివి తర్వాత ఒకరివి అవుతాయని మెగా అభిమానులు తెగ సంతోష పడిపోతున్నారు.

సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్ వయసులో వరుణ్ కన్నా పెద్దవారు. వీరి పెళ్లి ఎప్పుడా అని ఈ కుర్ర హీరోల ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కూడా చల్లటి కబురును ఫ్యాన్స్ కు తెలియచేసారు. అల్లు శిరీష్ పెళ్లి వార్త కూడా త్వ‌ర‌లో చెబుతారని ఈ మ‌ధ్యే అల్లు అర‌వింద్ ప్ర‌క‌టించారు. మరి ఈ మెగా ప్రిన్స్ శుభ వార్త ఎప్పుడూ చెబుతారో వేచి చూడాల్సిందే.

- Advertisement -

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు