Samantha: మరో బ్యూటిఫుల్ సాంగ్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగుతోపాటు బాలీవుడ్ లో కూడా సమంతకి ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే. అయితే సమంత నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ శాకుంతలం. ఈ సినిమా కోసం అభిమానులంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. ఈ మధ్యనే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.

కాళిదాసు రచించిన “అభిజ్ఞాన శాకుంతలం” ఆధారంగా గుణశేఖర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శాకుంతలగా సమంత నటించిన ఈ సినిమాలో దుష్యంతుడిగా దేవ్ మోహన్ కనిపించనున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఒక్కో పాటను విడుదల చేస్తూ వస్తుంది మూవీ యూనిట్.

తాజాగా ఈ చిత్రం నుంచి మరో పాటను విడుదల చేశారు. ” ఏలేలో ఏలేలో ఏలో యాల.. ఏటిలోన సాగే నావ, ఏలేలో ఏలేలో ఏలో యాల” అంటూ ఈ పాట సాగుతుంది. శాకుంతల తన భర్తను కలుసుకోవడానికి నావలో బయలుదేరి వెళుతున్న సమయంలో వచ్చే పాట ఇది. సందర్భానికి తగిన ట్యూన్ లో మణిశర్మ ఈ పాటను చేశారు. చైతన్య ప్రసాద్ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించారు.

- Advertisement -

బ్లాక్ అండ్ వైట్ వాల్ పెయింట్ మాదిరిగా ఈ పాటను అందించిన తీరు ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఈ సాంగ్ విడుదలై అభిమానులను ఆకట్టుకుంటుంది. అయితే ఈ చిత్రం ఫిబ్రవరి 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుందని మూవీ యూనిట్ ప్రకటించినప్పటికీ.. మరోసారి వాయిదా పడింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మూవీ యూనిట్ ప్రకటించిన రోజునే విడుదల అవుతుందా? లేక వాయిదా పడుతుందో వేచి చూడాలి.

For More Updates : 

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు