Kriti Sanon: బ్యాక్ టు బ్యాక్ సినిమాలు

సినిమా ఇండస్ట్రీకి వచ్చి తక్కువ సమయంలోనే ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్లు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ ఒకరు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 1 నేనొక్కడినే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ, ప్రస్తుతం బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ఈమె బాలీవుడ్ లోకి టైగర్ ష్రఫ్ నటించిన హీరోపంటి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ లో నటించిన మొదటి సినిమా మంచి విజయం సాధించడంతో అక్కడే వరుసగా అవకాశాలు వచ్చాయి. దీంతో కృతి టాలీవుడ్ కంటే బాలీవుడ్ లోనే ఎక్కువగా సినిమాలు చేస్తూ వస్తోంది.

ఇటీవల ఈ స్టార్ హీరోయిన్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆది పురుష్ లో సీత పాత్ర చేసింది. అలాగే తెలుగులో అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపురములో కు హిందీ రీమేక్ గా వస్తున్న షెహజాదా సినిమాలో నటించింది. దీంతో పాటు గణపత్ అనే మరో సినిమా చేస్తోంది. అంటే కృతి సనన్ నటించిన మూడు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

ఈ మూడు సినిమాలు రిలీజ్ కాకముందే, మరిన్ని సినిమాలకు సైన్ చేస్తూ ఫుల్ జోష్ లో ఉంది ఈ భాలీవుడ్ బ్యూటీ. తాజాగా ఈమె బాలీవుడ్ హీరో షాహీద్ కపూర్ తో ఒక సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. కాగా షాహీద్ తో కృతి సనన్ సినిమా ఉంటుందని చాలా రోజుల నుంచి రూమర్స్ వస్తున్నాయి. ఈ వార్తలపై తాజాగా కృతి స్పందించింది. షాహీద్ కపూర్ తో కలిసి చేసే సినిమా గురించి త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తానని వెల్లడించింది. దీంతో షాహిద్ తో సినిమా దాదాపు ఖాయమని, అది ప్రస్తుతం చర్చల దశలో ఉందని తెలుస్తోంది.

- Advertisement -

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు