Kangana Ranaut: నాపై నిఘా పెట్టారు

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదు. ఆమె పేరు లేకుండా ఏ ఒక్క రోజు కూడా వార్తలు రావంటే అతిశయోక్తి కాదు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉండే కంగానా తాజాగా మరోసారి సంచలన ఆరోపణలు చేసింది.

తన ప్రతి కదలికను గమనిస్తున్నారని, తనపై ఎవరో గూడచర్యానికి పాల్పడుతున్నారని ఆరోపించింది. తన వ్యక్తిగత సమాచారాన్ని కూడా దొంగిలిస్తున్నారని ఆరోపించింది. దీనిపై తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో సుదీర్ఘమైన నోట్ రాసుకోచ్చింది. “నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను ఫాలో అవుతున్నారు. నాపై గూడచార్యం చేస్తున్నారు. ఈ మధ్య నా పార్కింగ్ ఏరియా, నా ఇంటి బాల్కనీ మీదకు కూడా లెన్సులు జూమ్ అవుతున్నాయి.

ఉదయం 6:30 గంటలకు నా ఫోటోలు తీశారు. ఈ చిత్రాలను వారు ఏం చేస్తారు? నా వాట్సాప్, వృత్తిపరమైన ఒప్పందాలు, వ్యక్తిగత వివరాలు కూడా లీక్ అవుతున్నాయి. ఇవన్నీ స్త్రీ లోలుడైన ఓ సెలబ్రిటీ చేయిస్తున్నాడని తెలిసింది. ఇలాంటి పనులకు ఆయన భార్య అతన్ని ప్రోత్సహిస్తూ ఉండడం విచారకరం. పరిశ్రమలోకి వచ్చిన వారసులలో అతను ఒకరు. నా ఫైనాన్షియర్లు, వ్యాపార భాగస్వాములు ఎటువంటి కారణం లేకుండా చివరి నిమిషంలో ఒప్పందాలను విరమించుకున్నారు. అతను నన్ను ఒంటరిని చేసి మానసిక ఒత్తిడికి గురి చేయడానికి ప్రయత్నిస్తున్నాడు” అంటూ రాసుకొచ్చింది.

- Advertisement -

అయితే ఆమె ఆరోపణలు బాలీవుడ్ జంట రన్బీర్ కపూర్, అలియా భట్ గురించేనని బి టౌన్ లో చర్చ నడుస్తోంది.

 

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు