Devara : “దేవర”లో జాన్వీ పాటలకు మాత్రమే పరిమితమా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న పాన్ ఇండియా మూవీ “దేవర”. తాజాగా ఈ సినిమాకు సంబంధించి బయటకు వచ్చిన ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది. సినిమాలో జాన్వీ కపూర్ పాత్ర ప్రాధాన్యతపై కొత్త అనుమానాలు రేకెత్తించేలా ఈ సినిమాలో కేవలం నాలుగు పాటల కోసమే జాన్వి డేట్స్ కేటాయించిందని అంటున్నారు.

జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత డైరెక్టర్ కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్లో రూపొందుతున్న మూవీ “దేవర”. కోస్టల్ బ్యాక్ డ్రాప్ తో రాబోతున్న ఈ భారీ బడ్జెట్ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా, బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన దేవర గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కాగా గత ఏడాది ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కాగా, ఎలాంటి బ్రేకులు లేకుండా సైలెంట్ గా షూటింగ్ కానిచ్చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి 85% కంటే ఎక్కువగా షూటింగ్ పూర్తి కాగా, మిగిలిన భాగాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసే పనిలో పడ్డారు మేకర్స్. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ఫస్ట్ పార్ట్ ఏప్రిల్ 5న థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన బిజినెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికే ఈ సినిమా డీల్స్ చాలావరకు క్లోజ్ అయిపోయాయని సమాచారం. ఇక రిలీజ్ టైం దగ్గర పడుతున్న సమయంలో “దేవర” సినిమా గురించి వస్తున్న పలు వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అందులో ఒకటి “దేవర” సినిమాలో జాన్వీ కపూర్ పాత్రకు సంబంధించి పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు అని వస్తున్న రూమర్. నిజానికి తెలుగులో కమర్షియల్ సినిమా అంటే హీరోయిన్లను కేవలం పాటలలో గ్లామర్ వలకబోయడానికి మాత్రమే అన్నట్టుగా చూపిస్తూ ఉంటారు.

తాజాగా “దేవర” సినిమా విషయంలో జాన్వీ కపూర్ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది అనే రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చిత్ర బృందం జాన్వి కపూర్ ను ఈ సినిమాలోని నాలుగు పాటల కోసం మాత్రమే డేట్స్ కేటాయించమని కోరినట్టు ఫిలింనగర్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేదాకా వెయిట్ చేయాల్సిందే. కాగా “దేవర” సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయనున్నారని అంటున్నారు. మరోవైపు ఈ మూవీ అనుకున్న సమయానికి రిలీజ్ కాదని, ఈ మూవీ ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ నెలలోనే వచ్చే అవకాశం ఉండడంతో వాయిదా పడింది అనే వార్తలు వినబడుతున్నాయి. ఈ రూమర్లు అన్నింటిపై క్లారిటీ రావాలంటే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చేదాకా వెయిట్ చేయక తప్పదు.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు