Personality Development: గుర్తు పెట్టుకోండి… మిమ్మల్ని గౌరవించే వాళ్ళు ఎప్పుడూ బయట ఈ పనులు చేయరు

సాధారణంగా మనం గౌరవం అనే పదాన్ని పలుకుతూనే ఉంటాము. కానీ మన ఎవ్రీ డే లైఫ్ లో అవతలి వ్యక్తి మిమ్మల్ని గౌరవిస్తున్నారా లేదా అనే విషయం ఎలా తుంది? గౌరవం అంటే ఎమోషన్స్, ఆలోచనలు కలిగి ఉన్న మరొక వ్యక్తి మన ఎదురుగా ఉన్నాడు అని గుర్తించడం, వాళ్ల పట్ల శ్రద్ధ వహించడం, వాళ్లకు సంబంధించిన విషయాలకు ఇంపార్టెన్స్ ఇవ్వడం. ఒక వ్యక్తి మిమ్మల్ని నిజంగా గౌరవిస్తే బయటకు వెళ్లినప్పుడు లేదా బయట ఉన్నప్పుడు మీ ఇమేజ్ చెడిపోయే, శాశ్వతంగా దెబ్బతినే ఈ ఎనిమిది పనులను వాళ్ళు ఎప్పుడూ చేయరు.

1. బహిరంగంగా బయటకు వెళ్ళినప్పుడు లేదా నలుగురితో ఉన్నప్పుడు మిమ్మల్ని అగౌరవపరిచే విధంగా మాట్లాడుతున్నారు అంటే వాళ్లు నిజంగా మిమ్మల్ని గౌరవించట్లేదని అర్థం.

2. ఎవరైనా సరే బహిరంగంగా లేదా వ్యక్తిగతంగా ఎప్పుడూ చేయకూడని పని ఒక వ్యక్తిని కించపరచడం లేదా అవమానించడం. ఒకరినొకరు ఆట పట్టించుకోవడం, జోకులు వేసుకోవడం సాధారణ విషయమే. కానీ జోక్స్ పేరుతో అభ్యంతరకరంగా, అవమానంగా భావించే పదాలను వాడడం కరెక్ట్ కాదు. కాబట్టి ఎవరైనా మిమ్మల్ని అసభ్యకరంగా లేదా అవమానించే విధంగా మాట్లాడకూడదని గుర్తుపెట్టుకోండి.

- Advertisement -

3. మీకు నచ్చిన వ్యక్తి ఇతరులు మీ చుట్టూ ఉన్నప్పుడు మీరు లేనట్టే వ్యవహరిస్తున్నాడు అంటే అతను మిమ్మల్ని గౌరవించట్లేదు అని అర్థం. మీ పక్కనే ఉంటారు కానీ మీతో తప్ప మిగతావారితో మాట్లాడుతారు. మిమ్మల్ని ఎవరికి పరిచయం చేయరు, అలాగని కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వరు. ఒక వ్యక్తి మిమ్మల్ని గౌరవిస్తే ఇలా బహిరంగంగా ఎప్పుడూ ఇగ్నోర్ చేయరు అనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి.

4. ఎప్పుడైనా ఎవరినైనా కలవడానికి వెళ్ళినప్పుడు ఓ పది నిమిషాలు లేట్ అయితే ఏమవుతుందిలే అని లైట్ తీసుకుంటాము. కానీ అలా చేయడంవల్ల అవతలి వ్యక్తిని అగౌరవపరిచినట్టుగా అవుతుంది. కాబట్టి మీ విషయంలో ఎవరైనా ఇలా మిమ్మల్ని వెయిట్ చేయిస్తే వాళ్ళు మిమ్మల్ని గౌరవించట్లేదని అర్థం. వాళ్లు నిజంగా మిమ్మల్ని గౌరవిస్తే ఆలస్యంగా రావటానికి ట్రాఫిక్ లో చిక్కుకుంటే లేదంటే మరేదైనా ఇతర కారణం ఉంటే కనీసం ఫోన్ చేసి ఆ విషయాన్ని చెప్పి వాళ్ళలో ఉన్న సంస్కారాన్ని చూపిస్తారు.

5. ప్రతి ఒక్కరికి వాళ్ల వాళ్ల కుటుంబం, వాళ్ల సర్కిల్, ఫ్రెండ్స్ ఉంటారు. కానీ మీ కుటుంబంలోని వ్యక్తుల గురించి లేదా మీ గురించి తక్కువ చేసి మాట్లాడే హక్కు ఎవరికీ ఉండదు. ఎవరైనా మీ వాళ్లకు మీ గురించి చెడుగా చెబుతున్నారు అంటే అది కంప్లైంట్ లాంటిది. అది చెడ్డ సహవాసం. మిమ్మల్ని గౌరవించేవారు ఎప్పుడూ మీ ఎమోషన్స్ ని తోసిపుచ్చరు. ఒకవేళ మీ వాళ్ళలో ఎవరిలోనైనా ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి అంటే వాళ్లు మిమ్మల్ని గౌరవించట్లేదు అని అర్థం చేసుకోండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు