SSMB 29 : రాజమౌళి మూవీతో మహేష్ కు పక్కా ఇండస్ట్రీ హిట్… ఇదుగో ఇదే సాక్ష్యం

సూపర్ స్టార్ మహేష్ బాబుకు డైరెక్టర్ త్రివిక్రమ్ ఒక స్పీడ్ బ్రేకర్ లా ఉపయోగపడుతున్నారా? అంటే సమాధానం అవును. ఆయనతో ప్లాప్ అందుకున్న ప్రతిసారి నెక్స్ట్ మూవీతో మహేష్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే ఈ మాటకు కారణం. మహేష్ బాబు ఒక ఇండస్ట్రీ హిట్ అందుకోవాలి అంటే అంతకంటే ముందు ఆయన త్రివిక్రమ్ తో ఒక డిజాస్టర్ అందుకునే ఉండాలి. గతంలో వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

తాజాగా మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన “గుంటూరు కారం” సినిమా ఇటు గురూజీ అభిమానులను, అటు మహేష్ ఫ్యాన్స్ ను నిరుత్సాహపరిచిన విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా భారీ ఎత్తున విడుదలైన ఈ సినిమా ఇంకా బ్రేక్ ఈవెన్ ను దూరంలోనే ఉంది. ఈ నేపథ్యంలో గతంలో మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన సినిమాల గురించి చర్చ నడుస్తోంది. ముందుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా “అతడు” అనే సినిమాను చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కాకపోయినప్పటికీ మహేష్ అభిమానులకు ఇప్పటికీ ఫేవరెట్ మూవీనే. అతడు మూవీ తర్వాత మహేష్ బాబు చేసిన నెక్స్ట్ మూవీ “పోకిరి” అప్పట్లో బాక్స్ ఆఫీస్ ను దద్దరిల్లేలా చేసింది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ కు ఒక టర్నింగ్ పాయింట్ లా మారింది. ఈ సినిమాతో మహేష్ బాబు పాపులారిటీ బాగా పెరిగిపోయింది.

ఇక ఆ తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ “ఖలేజా” కూడా ఆశించిన విజయాన్ని అందించలేకపోయింది. కానీ అతడు సినిమాతో పాటు ఖలేజా కూడా మహేష్ కెరీర్ లో కల్ట్ మూవీస్ గా స్థానాన్ని దక్కించుకున్నాయి. ఇక ఖలేజా తర్వాత మహేష్ బాబు “దూకుడు” సినిమాను చేసి నాన్ ఎస్ఎస్ఆర్ రికార్డ్స్ బద్దలు కొట్టి మరోసారి ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. దీంతో టాలీవుడ్ లో మహేష్, త్రివిక్రమ్ కాంబో సెట్ కాదనే సెంటిమెంట్ మొదలైపోయింది. మహేష్ బాబు సైతం త్రివిక్రమ్ ను చాలా ఏళ్లు దూరం పెట్టేసాడు. ఇక రీసెంట్ గా వచ్చిన “గుంటూరు కారం” సినిమాతోనైనా ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తారేమో అనుకుంటే, దాన్ని మరింత స్ట్రాంగ్ చేసేలా కంటెంట్ లేని, గురూజీ మార్క్ అంతకంటే లేని సినిమాను తెరపైకి తీసుకొచ్చారు. అయితే ఈ సెంటిమెంట్ ను బట్టి చూసుకుంటే “గుంటూరు కారం” సినిమా హిట్ కాలేదు కాబట్టి రాజమౌళితో కలిసి మహేష్ బాబు చేయబోయే మూవీ ఇండస్ట్రీ హిట్ అవ్వడం ఖాయం అంటున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. రాజమౌళితో సినిమా అంటే ఎలాగూ హిట్ ఖాయం. ఇప్పుడు ఈ సెంటిమెంట్ కూడా తోడవ్వడంతో మహేష్ బాబు ఫ్యాన్స్ SSMB 29 మూవీ పక్కా బ్లాక్ బస్టర్ అనే భరోసాతో ఉన్నారు. ఇక “గుంటూరు కారం” సినిమా వల్ల త్రివిక్రమ్ శ్రీనివాస్ పై నెగెటివిటీ పెరగడంతో పాటు ఇప్పుడు ఈ సెంటిమెంట్ కూడా బయటకు రావడంతో మహేష్ బాబుకు త్రివిక్రమ్ ఒక స్పీడ్ బ్రేకర్ అన్నమాట, ఆయన ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలంటే ముందుగా త్రివిక్రమ్ కావాల్సిందే అంటూ సెటైర్లు వేస్తున్నారు.

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు