Jai Hanuman : “జై హనుమాన్”లో హీరో తేజ సజ్జా కాదా?

సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో “హనుమాన్” క్లియర్ విన్నర్ గా నిలిచాడు. చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ పెద్ద సినిమాలన్నింటినీ పక్కకు నెట్టేసి బాక్స్ ఆఫీస్ పై మరింత జోష్ తో దండయాత్ర చేస్తోంది. 50 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్లను కొల్లగొట్టడం సంచలనంగా మారింది. ఇక త్వరలోనే ఈ సినిమాకు సీక్వెల్ రాబోతోంది అనే విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే సీక్వెల్ “జై హనుమాన్”లో తేజా సజ్జా హీరో కాదు అనే విషయం ఇప్పుడు హాట్ హాట్ చర్చకు దారి తీసింది.

టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కుర్ర హీరో తేజా సజ్జా, అమృత అయ్యర్ హీరో హీరోయిన్లుగా నటించిన మీడియం బడ్జెట్ మూవీ “హనుమాన్”. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా, ముఖ్యంగా అందులో ఉన్న విజువల్ వండర్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. సినిమా రిలీజ్ అయ్యి పది రోజులు గడిచిపోతున్నప్పటికీ థియేటర్లు హౌస్ ఫుల్ గానే ఉండడం విశేషం. ఇక అసలు విషయంలోకి వస్తే… తాజాగా జరిగిన మీడియా ఇంట్రడక్షన్ లో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ “హనుమాన్” సీక్వెల్ గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ హనుమాన్ సీక్వెల్ “జై హనుమాన్”లో తేజా హీరో కాదని, ఆయన హనుమంతు పాత్రలో మాత్రమే కనిపిస్తాడని, కానీ సినిమాకు మెయిన్ హీరో మాత్రం ఆంజనేయ స్వామి అనీ, ఆ పాత్రను ఒక పెద్ద స్టార్ పోషిస్తాడనే విషయాన్ని వెల్లడించాడు. నిజానికి “హనుమాన్” మూవీ ఎండింగ్ లో కూడా రెండవ భాగంలో ఆంజనేయ స్వామి స్వయంగా చెడుతో పోరాడుతాడనే విషయాన్ని స్పష్టంగా చూపించాడు ప్రశాంత్ వర్మ. ఇప్పుడు మరోసారి అదే విషయంపై క్లారిటీ ఇచ్చాడు. మరి ఆంజనేయ స్వామిగా తెరపై ఎవరు కనిపించబోతున్నారు అన్నది ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ప్రశ్న.

కాగా తాజాగా “జై హనుమాన్” సినిమాకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అయోధ్య గురించిన చర్చే నడుస్తోంది. అయోధ్యలోని రామ మందిరంలో బాల రాముని ప్రాణ ప్రతిష్ట సందర్భంగా “జై హనుమాన్” మూవీ పోస్టర్ గొడవ రిలీజ్ చేసి, రామాయణంలో ఎవరికి తెలియని విషయాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నాం అనే విషయాన్ని ప్రకటించారు. కాగా ప్రస్తుతం “జై శ్రీరామ్ జై హనుమాన్” ఇంకా స్క్రిప్ట్ దశలోనే ఉన్నట్టు సమాచారం. స్క్రిప్ట్ పూర్తయ్యాక ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లోకి ఎంటర్ అవుతుంది. ఆ సమయంలో ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే హనుమాన్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో “జై హనుమాన్”పై ప్రేక్షకుల్లో ఇప్పటి నుంచే భారీ హైప్ నెలకొంది.

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు