Ayodhya: దేశమంతా రామ నామ స్మరణ… “రామాయణం” ఆధారంగా వచ్చిన తెలుగు సినిమాల లిస్ట్

అయోధ్యలో రామ మందిర ప్రారంభ మహోత్సవం, అందులో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా దేశం అంతా రామనామ స్మరణలో మునిగితేలుతోంది. ఈ క్రమంలో టాలీవుడ్ లో రాముడికి సంబంధించిన మహాకావ్యం రామాయణం సందర్భంగా రూపొందిన సినిమాలు ఏంటి అనే విషయంపై ఓ లుక్కేద్దాం. గత ఆరు దశాబ్దాల కాలంలో రాముని ఆధారంగా తెరకెక్కిన సినిమాలు ఏంటో తెలుసుకుని, బాల రాముని ప్రాణ ప్రతిష్ట సందర్భంగా మరోసారి వీక్షించండి.

1. సంపూర్ణ రామాయణం (1958, 1961, 1971)
వాల్మీకి రామాయణం ఆధారంగా తెలుగులో తెరకెక్కిన మొట్టమొదటి రాముడి కథ “సంపూర్ణ రామాయణం”. నందమూరి తారక రామారావు నటించిన ఈ మూవీ 1958లో రిలీజ్ అయింది. ప్రస్తుతం ఈ మూవీ యూట్యూబ్ లో అందుబాటులో ఉంది.

1961లో “సంపూర్ణ రామాయణం” పేరుతో రూపొందిన హిందీ సినిమా తెలుగులోనూ రిలీజ్ అయింది. ఇక ఆ తర్వాత శోభన్ బాబు, బాపు కాంబినేషన్లో “సంపూర్ణ రామాయణం” పేరుతో 1971లో మరో సినిమా వచ్చింది. ఈ రెండు సినిమాలు కూడా ప్రస్తుతం యూట్యూబ్ లోనే చూసేయొచ్చు.

- Advertisement -

2. 1961లో “సీతారామ కళ్యాణం”
సీతారాముల పరిణయాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించిన చిత్రం “సీతారామ కళ్యాణం”. ఈ మూవీకి సీనియర్ ఎన్టీఆర్ దర్శకత్వం వహించడం మాత్రమే కాకుండా ఇందులో ఆయన రావణాసురుడి పాత్రలో నటించడం విశేషం. ఇప్పటికీ పెళ్లిళ్లలో వినిపించే “శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి” అనే పాపులర్ సాంగ్ ఈ మూవీలోదే.

3. 1963లో “లవకుశ”
ఎన్టీఆర్, అంజలీదేవి సీతారాముడిగా కనిపించిన ఈ సినిమా ఇప్పటికీ ఎంతో మందికి డివోషనల్ సినిమాలలో హాట్ ఫేవరెట్. సి పుల్లయ్య, సిఎస్ రావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీరామ పట్టాభిషేకం తర్వాత సీతమ్మ ఎలాంటి కష్టాలు పడింది అనే విషయాలను కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. సీతమ్మ కష్టాల నేపథ్యంలో తెరపైకి వచ్చిన మొదటి మూవీ ఇదే. అలాగే తెలుగులో వచ్చిన మొట్టమొదటి కలర్ సినిమా కూడా లవకుశనే కావడం విశేషం.

4. 1976లో “సీతా కళ్యాణం”
రవికుమార్, జయప్రద ప్రధాన పాత్రను పోషించిన ఈ మూవీ సీతారాముల పరిణయ ఘట్టం నేపథ్యంలో రూపొందగా, బాపు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

5. 1978లో శ్రీరామ పట్టాభిషేకం
రామాయణంలోని అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింద కాండ, సుందరకాండ, యుద్ధకాండ నేపథ్యంలో ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వం వహించిన మూవీ “శ్రీరామ పట్టాభిషేకం”. ఈ సినిమాలో ఎన్టీఆర్ రాముడు గానే కాకుండా రావణాసురుడిగా కూడా నటించారు. సీతగా సంగీత కనిపించారు.

6. 1997లో “బాల రామాయణం”
గుణశేఖర్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ మూవీ “రామాయణం”. ఈ సినిమాలో సీతారాముల జననం, పరిణయం, వనవాసం, సీతాపహరణం, రామ రావణ యుద్ధం, రాముడి పట్టాభిషేకం వంటి విశేషాలను పూర్తిస్థాయిలో బాల నటీనటులతో రూపొందించారు. ఈ మూవీలో ఎన్టీఆర్ బాలరాముడిగా కనిపిస్తారు.

7. 2011లో “శ్రీరామ రాజ్యం”
నందమూరి బాలకృష్ణ, నయనతార సీతారాముడిగా, బాపు రమణ ద్వయం దర్శకత్వం వహించిన మూవీ శ్రీరామరాజ్యం.

8. ఆది పురుష్
నేటితరం యూత్ కోసం బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ చేసిన ప్రయత్నం “ఆది పురుష్”. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడిగా కనిపించగా, కృతి సనన్ సీత పాత్రను పోషించింది. 2023 జూన్ లో ఈ మూవీ రిలీజ్ అయింది.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు