ప‌వ‌న్ మూవీలో అకీరా నంద‌న్ పాత్ర అదేనా..?

టాలీవుడ్ లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు ఎంత క్రేజ్ ఉందో.. ఆయ‌న త‌న‌యుడు అకీరా నంద‌న్ కు కూడా దాదాపు అంతే క్రేజ్ ఉంది. అకీరా నంద‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు సినిమాల్లో న‌టించ‌క‌పోయినా.. మెగా ఫ్యాన్స్ నుంచి ఫుల్ స‌పోర్ట్ వ‌స్తుంది. ఇటీవ‌ల అకీరా బ‌ర్త్ డేను మెగా ఫ్యాన్స్ చేసిన‌ సెల‌బ్రేష‌న్ చూస్తే.. ఆయ‌న‌ ఫాలోయింగ్ తెలుస్తుంది. అయితే అకీరా నంద‌న్ ప‌వ‌ర్ స్టార్ తో టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్న‌ట్టు గ‌తంలోనే వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఏ సినిమాలో న‌టిస్తున్నాడు.. ఏ పాత్ర చేస్తున్నాడో క్లారిటీ మాత్రం రాలేదు.

కాగ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం హ‌రి హ‌ర వీర మ‌ల్లు సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ ఇప్ప‌టికే 60 శాతానికి పైగానే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇప్పుడు ప‌వ‌ర్ స్టార్ తో ఫైట్ సీన్స్ చిత్రీక‌రిస్తున్నారు. అయితే విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం.. అకీరా నంద‌న్ టాలీవుడ్ లోకి ఈ సినిమాతోనే అరంగేట్రం చేయ‌నున్నాడ‌ట‌. ప‌వ‌న్ తో పాటే సాగే ఒక కీల‌క పాత్ర‌లో అకీరాను చిత్ర బృందం ఎంపిక చేసింద‌ట‌.

అతి త్వ‌ర‌లోనే అకీరా నంద‌న్ షూటింగ్ లోనూ పాల్గొంటార‌ని ఇండ‌స్ట్రీ టాక్. మెగా కంపౌండ్ నుంచి ఇప్ప‌టికే తండ్రి కొడుకులు ఆచార్య‌లో న‌టిస్తున్నారు. ఇప్పుడు ఈ మూవీలో ప‌వ‌న్ – అకీరా న‌టిస్తున్నార‌నే వార్త మెగా ఫ్యాన్స్ ఫుల్ కిక్ ఇస్తుంది. అయితే సిల్వ‌ర్ స్క్రీన్ పై అకీరా నంద‌న్ తొలి సారి ఎలాంటి ఫ‌ర్మామెన్స్ ఇస్తాడో.. అని మెగా ఫ్యాన్స్ ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు