కే జి ఎఫ్ చాప్టర్-3 ఎప్పుడు? క్లారిటీ ఇచ్చిన యష్!


రాకింగ్ స్టార్ య‌ష్, ప్ర‌శాంత్ నీల్ కాంబోలో వ‌చ్చిన కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 భార‌త చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఎంత సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో తెలిసిందే. రాకీ భాయ్ ఫ‌ర్మామెన్స్ కు, ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్ కు సినీ ల‌వ‌ర్స్ ఫిదా అయిపోయారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమాకు రూ. 900 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్లు వ‌చ్చాయి. అత్య‌ధికంగా వ‌సూలు చేసిన నాలుగో మూవీగా రికార్డును కూడా సృష్టించింది. అయితే అతి త్వ‌ర‌లోనే రూ. 1000 కోట్ల క్ల‌బ్ లో కూడా చేర‌నుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.

చాప్టర్-3 ఉంటుంది అని చాప్టర్-2 లోనే క్లారిటీ ఇచ్చేశాడు ప్రశాంత్ నీల్. అయితే రాకీ భాయ్ చ‌నిపోయాడా..? ఒకవేళ బతికే ఉంటే, సముద్రంనుండి ఎలా బయటపడ్డాడు? ఒకవేళ చనిపోతే చాప్టర్-3లో హీరోగా ఎవరు వస్తారు అనే ప్రశ్నలను సినీ ప్రేమికులకు వదిలేశారు.వీటి స‌మాధానం కోసం అటు యష్ అభిమానులు, ఇటు పాన్ ఇండియా లెవెల్ లో కే జిఎఫ్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

అయితే తాజా గా ఓ హాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో కేజీఎఫ్ చాప్ట‌ర్ 3 గురించి రాకింగ్ స్టార్ చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ అవుతున్నాయి. కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 లో సీక్వెల్ కు కావాల్సిన క్లూస్ ఇచ్చామ‌ని తెలిపారు. కేజీఎఫ్ స్టోరీ రెండు చాప్ట‌ర్స్ లోనే చెప్ప‌డం సాధ్యం కాద‌ని అన్నారు. వ్యూచ‌ర్ లో చాప్ట‌ర్ – 3 త‌ప్ప‌క వ‌స్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. చాప్టర్-3 లో కూడా యష్ ఏ హీరోగా ఉండబోతున్నట్టు కూడా తెలుస్తుంది.

- Advertisement -

అయితే చాప్టర్-3 ఏ స‌మ‌యంలో వ‌స్తుందో, రాకీ భాయ్ సముద్రం నుండి ఎలా బయటపడ్డాడు, బయట పడి, అంతర్జాతీయ క్రిమినల్ గా ఎలా ఎదిగాడు అనే ప్రశ్నల సమాధానం కోసం ఫ్యాన్స్ లో మ‌రింత ఉత్కంఠ పెరిగింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు