మెగా ఫ్యాన్స్ మూడేళ్లుగా ఎదురుచూస్తున్న సమయం రానే వస్తుంది. మెగా స్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మల్టీ స్టారర్ గా వస్తున్న ఆచార్య మరో రెండు రోజుల్లో విడుదల కానుంది. తండ్రీ కొడుకులను ఒకే స్క్రీన్ పై చూడటానికి మెగా ఫ్యాన్స్ ఆత్రుతగా చూస్తున్నారు. సక్సస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇటీవల రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్ ఫ్యాన్స్ ను కాస్త నిరాశ పర్చినా.. ఎదో ఒక సెన్సెషన్ క్రియేట్ చేయడం ఖాయమని సినీ లవర్స్ భావిస్తున్నారు.
అయితే ఆచార్య మూవీ రివ్యూ రెండు రోజుల ముందే వచ్చేసింది. అధికారిక వర్గాల సమాచారం మేరకు.. మెగా స్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ డెడ్లి గా ఉందట. లార్జ్ డోస్ ఎంటర్ టైన్ మెంట్ తో మెగా ఫ్యాన్స్ పూనకాలు రావడం ఖాయమని తెలుస్తుంది. చిరంజీవి మాస్ మసాల పర్ఫామెన్స్ అదిరిపోయిందట. రంజాన్ పండుగ సమయంలో ఫ్యాన్స్ కు మెగాస్టార్ బిగ్ గిఫ్ట్ ఇచ్చేలా ఆచార్య మూవీ ఉంటుందట. అంతే కాకుండా.. ఈ మూవీ కి రివ్యూ 4 స్టార్స్ పైగానే రేటింగ్ ఉంటుందట.