Taapsee : సీక్రెట్ గా తాప్సీ పెళ్లి చేసుకుందా..? అసలు విషయం ఇదే..!!

Taapsee : చాలామంది సెలబ్రిటీలు సడన్ గా ఎంగేజ్మెంట్, వివాహం చేసుకొని ఒకసారిగా అభిమానులకు సడన్ సర్ప్రైజ్ ఇస్తూ ఉంటారు.. ఇప్పుడు తాజాగా ఈ న్యూస్ లో హైలెట్ గా మారుతోంది హీరోయిన్ తాప్సీ పన్ను.. గతంలో ఇప్పుడే పెళ్లి ఆలోచన లేదంటూ చెప్పిన ఈమె.. తాజాగా తాప్సీ (Taapsee) పెళ్లి జరిగిపోయినట్టుగా పలు రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. ఎలాంటి హడావిడి లేకుండా పెళ్లి చేసుకుందనే వార్తలు వినిపిస్తూ ఉండడంతో.. అటు అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.

రహస్యంగా తాప్సీ పెళ్లి..

ఇదంతా ఇలా ఉండగా గత కొంతకాలంగా డెన్మార్క్ బ్యాడ్మింటన్ మథియస్ బోన్ తో ప్రేమాయణం నడుపుతున్నట్లుగా కూడా వార్తలు వినిపించాయి.. అంతేకాకుండా ఇద్దరు కలిసి ఎన్నోసార్లు మీడియా కంట కూడా పడడం జరిగింది.. అయితే ఇప్పుడు తాజాగా సీక్రెట్ గా వివాహం చేసుకున్నారనే వార్తలు ఈ జంట పైన వినిపిస్తున్నాయి.. అది కూడా ఈనెల 23వ తేదీని వీరి వివాహం జరిగినట్లు బంధువులు, స్నేహితుల సమక్షంలో ఉదయపూర్ లో వీరి వివాహం జరిగిందని సమాచారం..
అయితే తాప్సీ స్నేహితులు పవైల్ గులాటి , కనిక ధిల్లాన్, అనురాగ్ కశ్యప్ సోషల్ మీడియా ద్వారా కొన్ని ఫోటోలను షేర్ చేయగా..ఇందులో తాప్సి ,మథియస్ బొన్ మాత్రం కనిపించకపోవడంతో పాటు వీరు ఒక పెళ్లిలో ఉన్నామని అది ఎవరు ఊహించలేరు అనే విధంగా పోస్ట్ చేశారు.. మేరే యార్ కి షాదీ అంటూ కనిక దిల్లాన్ కూడా పలు రకాల ఫోటోలను షేర్ చేసింది.. దీంతో చాలామంది తాప్సీ పెళ్లి అయిపోయిందంటూ పలువురు నెటిజెన్స్ కూడా తెలుపుతున్నారు.. ఈ విషయం తెలిసిన అభిమానుల సైతం తాప్సికి విషెస్ తెలుపుతూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు

తాప్సీ కెరియర్..

టాలీవుడ్ డైరెక్టర్ రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఝుమ్మంది నాదం సినిమా ద్వారా మొదటిసారి తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ తాప్సీ.. ఈ సినిమాలో తన గ్లామర్ తో, నటనతో మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత తెలుగులో ఎన్నో చిత్రాలలో నటించింది తాప్సీ.. సరైన సక్సెస్ రాలేకపోవడంతో బాలీవుడ్ వైపుగా అడుగులు వేస్తూ.. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా భారీ క్రేజ్ ను సంపాదించుకుంది. పలు రకాల లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ..

- Advertisement -

అయితే తాప్సీ ఈ విషయం పైన క్లారిటీ ఇస్తూ రూమర్లకు సైతం చెక్ పెడుతుందా లేకపోతే నిజంగానే పెళ్లి చేసుకుందా అనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు