Kriti Sanon : తనకంటే పదేళ్లు చిన్నవాడైన అబ్బాయితో కృతి సనన్ ఎఫైర్..?

Kriti Sanon : టాలీవుడ్ ఇండస్ట్రీ అయినా… బాలీవుడ్ ఇండస్ట్రీలో అయినా హీరోయిన్లు కామన్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా హీరోయిన్లు ప్రేమలో పడడం మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు హీరోయిన్లు.. ఏకంగా హీరోలనే ప్రేమించి పెళ్లి చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. అంతేకాదు హీరోలోనే కాకుండా నిర్మాతలు లేదా దర్శకులను కూడా హీరోయిన్లు ప్రేమించారు. కొంతమంది ప్రేమించి పెళ్లి చేసుకుంటే… మరి కొంతమంది హీరోయిన్లు బ్రేకప్ చెప్పారు.

ఇక కొంతమంది హీరోయిన్లు అయితే పెళ్లి చేసుకున్న తర్వాత విడాకులు ఇచ్చిన వారు కూడా ఉన్నారు. సమంత కూడా అచ్చం ఇలాగే పెళ్లి చేసుకున్న తర్వాత విడాకులు ఇచ్చింది. అయితే కొంతమంది హీరోయిన్లు.. తమకంటే చిన్న వయసు వారిని కూడా ప్రేమిస్తూ ఉంటారు. అలాంటి వారి ఖాతాలో తాజాగా హీరోయిన్ కృతి సనన్ చేరిపోయింది.

బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ (Kriti Sanon) గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సినిమాలే చేసింది. మహేష్ బాబు హీరోగా చేసిన నేనొక్కడినే అనే సినిమాలో మెరిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నాగచైతన్య హీరోగా చేసిన దోచేయ్, ఆది పురుష లాంటి సినిమాలలో కూడా మెరిసింది హీరోయిన్ కృతి సనన్.

- Advertisement -

అయితే తాజాగా కృతి సనన్ తనకన్నా వయసులో 10 సంవత్సరాలు చిన్నవాడు అయిన కుర్రాడితో ప్రేమలో పడిందని వార్తలు వస్తున్నాయి. ఆమె రీసెంట్ గా వీకెండ్ హాలిడేస్ కోసం లండన్ వెళ్లిందట. అక్కడ తనకంటే చిన్నవాడైన ఓ కుర్రాడుతో హీరోయిన్ కృతి సనన్ కనిపించిందట. ఆ అబ్బాయితో హీరోయిన్ కృతి సనన్ డేటింగ్ చేస్తుందని ప్రచారం చేస్తున్నారు. అతని పేరు కబీర్ అని… అతని వయసు 23 సంవత్సరాలు మాత్రమే ఉంటుందని చెబుతున్నారు. కాగా హీరోయిన్ కృతి సనన్ వయస్సు 33 సంవత్సరాలు అన్న సంగతి తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు