Sreeleela: టాలీవుడ్ హీరోకు రెండు కోట్లు ఇచ్చిన హీరోయిన్ శ్రీ లీల?

టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో ఎంతో మంది హీరోయిన్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కానీ అందులో… కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతారు. అలా సక్సెస్ అయిన వారిలో హీరోయిన్ శ్రీ లీల ఒకరు. హీరోయిన్ శ్రీ లీల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.

పెళ్లి సందడి సినిమాతో ఇండస్ట్రీలు అడుగుపెట్టిన హీరోయిన్ శ్రీ లీల… ఆ తర్వాత వెనక్కి చూసుకోలేదు. ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినా రవితేజ హీరోగా చేసిన ధమాకా సినిమాతో బంపర్ విజయాన్ని అందుకుంది హీరోయిన్ శ్రీ లీల. ధమాకా సినిమా తర్వాత ఇండస్ట్రీలో దాదాపు 6 నుంచి 8 సినిమాలను లైన్లో పెట్టింది ఈ బ్యూటీ. ఇక ఇటీవల బాలయ్య చేసిన భగవంతు కేసరిలోనూ అద్భుతంగా నటించి అందర్నీ మెప్పించింది.

ఇది ఇలా ఉండగా విజయ్ దేవరకొండ సినిమాలో హీరోయిన్ శ్రీ లీల నటిస్తోందని మొన్నటి వరకు వార్తలు వచ్చాయి. ఈ సినిమాకు సైన్ కూడా చేసిందట హీరోయిన్ శ్రీ లీల. అయితే ఈ సినిమాలో ఎక్కువగా లిప్ లాక్ సీన్లు ఉన్నాయట. ఈ విషయాన్ని ఆమె సైన్ చేశాక చెప్పారట. దీంతో విజయ్ దేవరకొండ సినిమాను రిజెక్ట్ చేసిందని సమాచారం. ఇండస్ట్రీలో ఒక సినిమాకు సైన్ చేసిన తర్వాత మధ్యలో వదిలి వెళ్ళిపోతే… రెమ్యూనరేషన్ లో సగం తిరిగి ఇవ్వాల్సిందే. అలా దాదాపు రెండు కోట్ల వరకు చిత్ర బృందానికి ఇచ్చిందట శ్రీ లీల. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు