Weight loss : 80/20 Principal కొత్త డైట్… ఒక్క నెలలోనే రిజల్ట్స్

బరువు పెరగడం అనేది కేవలం అందంపై ఎఫెక్ట్ చూపడమే కాదు, కాన్ఫిడెన్స్ ను కూడా దెబ్బతీస్తుంది. మరోవైపు హెల్త్ ను కూడా పాడు చేస్తుంది. అమ్మాయిలైనా, అబ్బాయిలైనా బరువును కంట్రోల్ లో పెడితేనే మంచిది. అధిక బరువు సమస్య గుండె జబ్బులు, డయాబెటిస్, మెంటల్ స్ట్రెస్ లాంటి డేంజరస్ వ్యాధులకు కారణం అవుతుంది. ఏం చేసినా బరువు తగ్గట్లేదు అనుకునే వారి కోసమే తాజాగా ఓ కొత్త డైట్ ను కనిపెట్టారు. 80/20 పేరుతో వచ్చిన ఈ డైట్ అధిక బరువుతో బాధ పడుతున్న వాళ్లకు ఒక వరమని చెప్పొచ్చు. మరి ఆ డైట్ ను ఎలా పాటించాలి ? అది బరువును ఎలా తగ్గిస్తుంది ? అసలు 80/20 అంటే ఏంటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Weight loss 80/20 Principal

ఈ పద్ధతితో తినకుండా కడుపు కాల్చుకోవడం, లేదా ఎక్కువ సమయం జిమ్ లో చెమటలు చిందించడం లాంటివి చేయాల్సిన అవసరం లేదు. 80/20 డైట్ ప్రకారం ప్రతిరోజూ మనం తీసుకునే ఆహారంలో 80 శాతం ఆరోగ్యకరమైన, పోషకమైన ఆహారాలు కలిగి ఉండాలి, మిగిలిన 20 శాతం ఆహారం తక్కువ పరిమాణంలో తినవచ్చు. అన్ని వయసుల వారు ఈ డైట్ తీసుకోవచ్చు.

- Advertisement -

Weight loss 80/20 Principal

ప్రతిరోజూ తినే ఫుడ్ లో 80 శాతం ఏమేం ఉండాలి అంటే… డైటీషియన్స్ ప్రకారం ఆహారంలో 80% తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, గింజలు, ఆకుకూరలు ఉండాలి. చికెన్, ఫిష్ వంటి ఇతర ప్రోటీన్ ఫుడ్ కూడా తినొచ్చు. వీటితో పాటు ఒమేగా -3 ఫ్యాట్స్, తక్కువ కొవ్వు ఉండే పాల ఉత్పత్తులు, సీ ఫుడ్ కూడా ఆరోగ్యకరమైనవి. వీటన్నింటినీ రోజూ తినే ఫుడ్ లో భాగంగా చేర్చుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం. అలాగే బరువు కూడా కంట్రోల్ లో ఉంటుంది.

Weight loss 80/20 Principal

మరి మిగిలిన 20 శాతం ఆహారం ఎలా ఉండాలి ? అంటే… ఒక్కొక్కరు ఒక్కో రకమైన ఫుడ్ ను ఇష్టపడతారు. మరి మనకున్న ఆహారపు అలవాట్లను సడన్ గా మార్చుకోవాలి అంటే కష్టమే. అందుకే మనకు ఎక్కువగా తినాలి అన్పించే అనారోగ్యకర ఫుడ్ ను 20 శాతం రోజూ తినే ఫుడ్ లో చేర్చుకోవడం వల్ల నోరు కట్టేసుకున్న ఫీలింగ్ రాదు. అలాగే వాటిపై మనసు లాగడం చాలా వరకు తగ్గుతుంది. ఈ విధంగా తీపి పదార్థాలు, నూనె పదార్థాలు. డీప్ ఫ్రై ఫుడ్ వంటి వాటిని తక్కువగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేస్తే ఒకే ఒక్క నెలలో బరువు తగ్గడం ఖాయమట. మరి మీరు కూడా బరువు తగ్గాలి అనుకుంటే ఈ 80/20 డైట్ ను పాటించి చూడండి. మరిన్ని డీటైల్స్ కోసం 80/20 ప్రిన్సిపుల్ బుక్ ను చదవండి

Weight loss 80/20 Principal

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు