Navdeep : పెళ్లి పీటలెక్కనున్న హీరో నవదీప్..!

Navdeep :  ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణం వాడి వేడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రజలలో ఎలాగైనా సరే తమ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి రాజకీయ పార్టీలు, సినీ సెలబ్రిటీల పైన ఆధారపడుతున్నారు. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు, రాజకీయాలలో అడుగు పెట్టగా ఇప్పుడు మరో ప్రముఖ హీరో రాజకీయాలలోకి రాబోతున్నట్లు ఒక వార్త తెరపైకి వచ్చింది.. ఇక ఆయన ఎవరో కాదు టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి ఒకపక్క హీరోగా మరోపక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి పేరు దక్కించుకున్న ( Navdeep ) నవదీప్.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిప్రాయాలను వ్యక్తం చేయడమే కాదు తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటారు.. ఇదిలా ఉండగా తాజాగా నవదీప్ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని పంచుకోగా.. అందులో ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

రాజకీయాలలోకి నవదీప్..

తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని పంచుకున్నారు నవదీప్.. ఆ వీడియోలో నవదీప్ మాట్లాడుతూ.. ప్రతిరోజు ఇంటికి వెళ్లినా, ఇంస్టాగ్రామ్ లోకి వెళ్లినా ఒకటే ప్రశ్న.. అది ఎప్పుడు అని..చెప్తా..రేపు చెప్తా.. అది నా పెళ్లి డేట్ అయి ఉండవచ్చు.. లవ్ డేట్ అయి ఉండవచ్చు.. లేదా ఎలక్షన్స్ లో నేను నిలబడుతున్న నామినేషన్ డేట్ అయిండొచ్చు.. చెప్తా.. రేపు చెప్తా.. అప్పటిదాకా మీరు గెస్ చేయండి.. అంటూ చెప్పుకొచ్చారు.. ఈ పోస్ట్ కి డేట్ డేటెడ్ డేటింగ్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు నవదీప్.. ఇంకా ఈ వీడియో చూస్తే .. పక్కాగా సినిమా డేట్ అయ్యుంటుందిలే అంతకుమించి ఏముంటుంది అంటూ కామెంట్ చేస్తున్నారు.. మరి కొంత మంది ఏదైనా చెప్పు బ్రో మేము బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నామంటున్నారు .. దీంతో ఈ వీడియో కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

పెళ్లిపై క్లారిటీ..

ఇకపోతే తాజాగా నవదీప్ షేర్ చేసిన ఈ వీడియో గనుక గమనిస్తే ఈయన పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.. మరి నవదీప ప్రకటించే ఆ తేదీ తన సినిమా రిలీజ్ తేదీ అవుతుందా లేక తన పెళ్లి తేది అవుతుందా లేక ఎలక్షన్స్ లో నామినేషన్ వేసే రోజు అవుతుందో తెలియక అభిమానులు సైతం కన్ఫ్యూజన్లో పడ్డారని చెప్పవచ్చు. మొత్తానికి అయితే నవదీప్ పెళ్లి చేసుకుంటున్నాను అంటూ స్వయంగా క్లారిటీ ఇవ్వకపోయినా కూడా డేట్ డేటెడ్ డేటింగ్ అంటూ చేసిన కామెంట్లు పెళ్లి పైనే అంటూ కన్ఫర్మ్ చేసేలా కనిపిస్తున్నాయి. మరి వీటిపై నవదీప్ మళ్లీ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు