Anushka : రాజకీయాలలోకి స్వీటీ.. ఆ పార్టీ నుంచే పోటీ..!

Anushka : సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన అనుష్క శెట్టి ఒకప్పుడు వరుస సినిమాలతో స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంది.. ఇకపోతే భాగమతి , నిశ్శబ్దం సినిమాలు చేసి ఆ తర్వాత సైజ్ జీరో సినిమా చేసిన ఈమె.. పూర్తిగా బరువు పెరిగిపోయి.. ఇక సినిమాలకు శాశ్వతంగా దూరమైంది. గత ఏడాది మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె ఇప్పుడు మలయాళం లో ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదిలా ఉండగా తాజాగా పాలిటిక్స్ లోకి రాబోతోంది అంటూ ఒక వార్త తెరపైకి వచ్చింది. మరి ఇందులో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.

పాలిటిక్స్ లోకి అనుష్క..

సినిమా రంగానికి , రాజకీయ రంగానికి విడదీయరాని సంబంధం ఉంది.. అది మొదటి నుంచి మనం చూస్తున్నదే.. ఇప్పటికే ఎంతోమంది నటీనటులు ఎప్పటినుంచో రాజకీయాలలో దూసుకుపోతున్నారు.. ఈ క్రమంలో ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ పార్టీ ఇప్పుడు రన్నింగ్ లో ఉండగా.. తమిళనాడులో స్టార్ హీరో విజయ్ రీసెంట్ గా తన రాజకీయ రంగ ప్రవేశాన్ని కూడా ప్రకటించారు.. తమిళనాడు విక్టరీ కజగం అనే పేరుతో రాజకీయ పార్టీని ప్రారంభించి.. 2026 లో వచ్చే సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు కూడా.. ఈ నేపథ్యంలోనే అనుష్క కూడా రాజకీయాల్లోకి రాబోతోంది అంటూ ఒక వార్త తెరపైకి వచ్చింది.. అయితే ఆమె ఏ పార్టీలో చేరబోతోంది.. ఒకవేళ చేరితే పోటీ చేస్తారా లేదా అనే విషయాలపై పలు ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి..

పవన్ కళ్యాణ్ పార్టీలో చేరిక..

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఆంధ్రాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో అనుష్క ( Anushka ) చేరతారనే వార్త ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది.. అంతేకాదు వైసీపీ నుంచి మాజీ హీరోయిన్ రోజా ఎమ్మెల్యేగా , మినిస్టర్ గా ఉన్నారు. నగరి నుంచి ఆమె పోటీ చేసి గెలిచారు కూడా.. అయితే ఈ నియోజకవర్గాలలో ఇప్పుడు తమిళ్, కన్నడ ప్రభావిత జనాలు ఎక్కువగా ఉండడం వల్లే అనుష్కను నగరి నుంచి పోటీలో ఉంచబోతున్నట్లు నెట్టింట చర్చించుకుంటున్నారు.. ఇప్పటికే సినిమాలలో అవకాశాలు లేక సినిమా రంగంపై ఆసక్తి కోల్పోయిన ఈమె రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకుందట.. ఇక జనసేన పార్టీ తరఫున అసెంబ్లీ ఎన్నికలలో అనుష్కను నిలబెట్టేలా చర్చలు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త చాలా వైరల్ గా మారుతుంది.. ఇకపోతే ఈ విషయంపై పూర్తి విషయాలు తెలియాలి అంటే అటు అనుష్క లేదా ఇటు పవన్ కళ్యాణ్ లేదా జనసేన పార్టీ బృందం ఎవరో ఒకరు అధికారికంగా ప్రకటిస్తే తప్ప అసలు విషయాలు వెలుగులోకి రావు.. ఇకపోతే ఈ విషయంపై పూర్తి విషయాలు తెలియాలి అంటే అటు అనుష్క లేదా ఇటు పవన్ కళ్యాణ్ లేదా జనసేన పార్టీ బృందం ఎవరో ఒకరు అధికారికంగా ప్రకటిస్తే తప్ప అసలు నిజాలు వెలుగులోకి రావని చెప్పవచ్చు..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు