Nithin : ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్.. ఒకేసారి రెండు అప్డేట్స్..!

Nithin : జయం సినిమాతో మొదటిసారి హీరోగా ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో నితిన్ టాలీవుడ్ లో తనకంటూ ఒక ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్నారు.. మీడియం రేంజ్ హీరోలలో మంచిగా మార్కెట్ వున్న హీరోగా పేరు సంపాదించారు నితిన్.. ఒకవైపు క్లాస్ , మాస్ సినిమాలు చేస్తూనే కామెడీ జోనర్ లో కూడా ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటారు. ఈరోజు నితిన్ 41వ పుట్టినరోజు సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించి పలు అప్డేట్లను సైతం చిత్ర బృందాలు ప్రకటిస్తూనే ఉన్నాయి.. వాటి గురించి చూద్దాం.

నితిన్ న్యూ మూవీ అప్డేట్..

నితిన్ అసలు పేరు నితిన్ కుమార్ రెడ్డి( Nithin ).. ఈయన తండ్రి కూడా ప్రముఖ నిర్మాత డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి.. నితిన్ కెరియర్ లో ఎక్కువ సక్సెస్ ల కంటే ఫ్లాప్లే ఉన్నాయి.. నితిన్ అప్ కమింగ్ సినిమాల విషయానికి వస్తే.. డైరెక్టర్ వెంకీ కుడుముల డైరెక్షన్లో వస్తున్న తాజా చిత్రం రాబిన్ హుడ్.. భీష్మ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా రావడం గమనార్హం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది.. ఈరోజు నితిన్ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ బర్తడే విషెష్ తెలియజేస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేశారు.. ఈ పోస్టర్లో నితిన్ కమాండర్ గెటప్ లో మాస్ లుక్ లో కనిపిస్తున్నారు. అయితే గతంలో నితిన్ ఈ సినిమాలో దొంగగా కూడా కనిపించబోతున్నట్లు తెలియజేశారు. అలాగే బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కూడా కీలకమైన పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం.

తమ్ముడు ఫస్ట్ లుక్ పోస్టర్..

మరోవైపు పవన్ కళ్యాణ్ నటించిన చిత్రాలలో తమ్ముడు సినిమా కూడా ఒకటి.. ఈ సినిమా టైటిల్ తో నితిన్ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు..ఈ చిత్రానికి వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ని కూడా విడుదల చేశారు.. ఈ పోస్టర్లో నితిన్ మాస్ లుక్ లో అదరగొట్టేస్తున్నట్టుగా కనిపిస్తోంది.. ఈ పోస్టర్ విషయానికి వస్తే.. నితిన్ బస్సుపై కూర్చొని సుబ్రమణ్య స్వామి ఆయుధం పట్టుకొని కూర్చున్నట్టుగా కనిపిస్తున్నారు.. నితిన్ గత చిత్రాల కంటే తమ్ముడు సినిమా చాలా భిన్నంగా ఉండేలా కనిపిస్తోంది.

- Advertisement -

నితిన్ సినీ కెరియర్..

నితిన్ తన 22 ఏళ్ల సినీ కెరియర్ లో ఇప్పటివరకు 32 పైగా సినిమాలను నటించారు. నితిన్ తన కెరియర్లో రాఘవేంద్రరావు, ఎస్ఎస్ రాజమౌళి, పూరి జగన్నాథ్, రాంగోపాల్ వర్మ, వివి వినాయక్, త్రివిక్రమ్.. తదితర డైరెక్టర్లతో పని చేశారు. అలా ఇంతమంది డైరెక్టర్లతో పనిచేసిన మరో హీరో కూడా లేరని చెప్పవచ్చు.. నితిన్ సొంతంగానే ఒక ఫిలిం ప్రొడక్షన్ హౌస్ ని కూడా స్థాపించారు. మొత్తానికి అయితే ఈరోజు రెండు సినిమా అప్డేట్ల ను ఇచ్చి అభిమానులను ఫుల్ ఖుషి చేశారు నితిన్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు