Hari Hara Veera Mallu : టీజర్ వచ్చేస్తుంది

పవర్ స్టార్ అభిమానులతో పాటు మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా హరి హర వీర మల్లు. 2020 సెప్టెంబర్ లో స్టార్ట్ అయిన ఈ సినిమా కరోనా మహమ్మారితో పాటు పవన్ డేట్స్ వల్ల వాయిదా పడుతూ వస్తుంది. భీమ్లా నాయక్ తర్వాత పవన్ లైనప్ చేసిన సినిమాల్లో హరి హర వీరమల్లు ఒకటి. దీంతో పాటు వినోదయ సీతం, భవదీయుడు భగత్ సింగ్ కూడా లిస్ట్ లో ఉన్నాయి. అయితే, ఈ రెండు సినిమాలు ఇప్పట్లో వచ్చేట్టు కనిపించడం లేదు.

కానీ, ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తి అయిన హరి హర వీరమల్లు సినిమాను మాత్రం పవన్ త్వరగా పూర్తి చేసుకోవాలని చూస్తున్నట్టు సమాచారం. టాలీవుడ్ నిర్మాతల స్ట్రైక్ తర్వాత హరి హర వీరమల్లును సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉండగా, హరి హర వీరమల్లు నుండి ఇప్పటి వరకు ఎక్కువగా అప్ డేట్స్ రాలేదు. దీనిపై పవన్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. సినిమా నుండి టీజర్, కనీసం గ్లింప్స్ విడుదల చేసినా, ట్విట్టర్ లో ట్రెండ్ చేయాలని చూస్తున్నారు. కానీ, ఇప్పటి వరకు పవర్ స్టార్ ఫ్యాన్స్ కల నెరవేరలేదు.

తాజాగా వస్తున్న వార్తలను చూస్తే, ఫ్యాన్స్ కోరిక తీర్చే రోజు వచ్చినట్టు కనిపిస్తుంది. ఎంతో ఆసక్తి ఎదురుచూస్తున్న హరి హర వీరమల్లు సినిమా టీజర్ ను సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని టీం నిర్ణయం తీసుకుందని సమాచారం. సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కాబట్టి ఫ్యాన్స్ కు ట్రీట్ ఇవ్వాలని హరి హర వీరమల్లు టీం ఫిక్స్ అయిందని టాక్. దీంతో పవన్ ఫ్యాన్స్ సెప్టెంబర్ 2 కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు