Extra Ordinary Man : ‘ఏజెంట్’పై డైరెక్టర్ స్పెషల్ ఇంటరెస్ట్… నితిన్ ఫ్యాన్స్ కు టెన్షన్

నితిన్ తాజా చిత్రం “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్”. డిసెంబర్ 8న రిలీజ్ కాబోతున్న ఈ మూవీకి వక్కంతం వంశీ డైరెక్టర్ గా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో తాజాగా ‘ఏజెంట్’ మూవీపై డైరెక్టర్ వక్కంతం వంశీ చేసిన వ్యాఖ్యలు నితిన్ ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతున్నాయి.

యంగ్ హీరో నితిన్, క్రేజీ బ్యూటీ శ్రీలీల హీరో హీరోయిన్లుగా నటిస్తున్న కమర్షియల్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్”. డైరెక్టర్ కం రైటర్ వక్కంతం వంశీకి దర్శకుడిగా ఇది రెండవ సినిమా. ఈ సినిమా రిలీజ్ కు కేవలం ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉండగా, చిత్ర బృందం ప్రస్తుతం సినిమా ప్రమోషన్లతోనే బిజీగా ఉంది. ఈ క్రమంలో డైరెక్టర్ వక్కంతం వంశీ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ఏజెంట్’ మూవీపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. అఖిల్ అక్కినేని హీరోగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘ఏజెంట్’ మూవీ ఏప్రిల్ 28న రిలీజ్ అయిన విషయం తెలిసిందే. దాదాపు 80 కోట్ల భారీ బడ్జెట్ లో రూపొందిన ఈ మూవీ డిజాస్టర్ గా మిగిలింది. కేవలం 10 కోట్లలోపే కలెక్షన్లను రాబట్టి నిర్మాతలకు భారీగా నష్టాలను మిగిల్చాడు. అలాగే అఖిల్ ఖాతాలో కూడా భారీ డిజాస్టర్ పడింది.

ఇదిలా ఉండగా తాజాగా “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్” మూవీ ప్రమోషన్స్ లో వక్కంతం వంశీ మాట్లాడుతూ ‘ఏజెంట్’ మూవీ కథ తనదేనని, కానీ ఇప్పటివరకు ఆ సినిమాను చూడలేకపోయానని, కథలో సురేందర్ రెడ్డి ఎలాంటి మార్పులు చేశారో కూడా తనకు తెలియదని చెప్పుకొచ్చాడు. అయితే ‘ఏజెంట్’ మూవీకి రైటర్ గా తన పేరు కూడా ఉండడంతో ఆ సినిమా డిజాస్టర్ లో తనకు కూడా భాగం ఉంటుందని చెప్పుకొచ్చాడు. తన కెరీర్లో కథను అందించి కూడా చూడలేకపోయిన సినిమా ‘ఏజెంట్’ ఒక్కటేనని వక్కంతం వంశీ పేర్కొన్నాడు. అయితే ఆ సినిమా సంగతి ఎలా ఉన్నా ప్రస్తుతం వక్కంతం వంశీ చేసిన కామెంట్స్ నితిన్ ఫ్యాన్స్ ను టెన్షన్ లో పడేశాయి.

- Advertisement -

వక్కంతం వంశీ దర్శకత్వం వహించిన ఫస్ట్ సినిమా “నా పేరు సూర్య” ఫ్లాప్ గా నిలిచిన విషయం తెలిసిందే. అలాగే రీసెంట్ గా వచ్చిన ‘ఏజెంట్’ స్టోరీ కూడా ఈ డైరెక్టర్ దే కావడం, పైగా అది కూడా డిజాస్టర్ అవ్వడం, అది చాలదన్నట్టు ఇప్పుడు వంశీ “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్” చేయడంతో నితిన్ ఫ్యాన్స్ అంతా టెన్షన్ గా ఉన్నారు. పైగా ఈ మూవీ రిలీజ్ టైములో “ఏజెంట్” ఇంకా ఓటిటిలో రిలీజ్ రాలేదు, చూడలేదు అని ఆయన కామెంట్స్ చేయడం వారికి నచ్చట్లేదు. అయితే “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్” మూవీ ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందనే నమ్మకంతో ఉన్నారు టీం అంతా. మరి వారి నమ్మకం ఎంత వరకు నిలబడుతుందో తెలియాలంటే శుక్రవారం దాకా వెయిట్ చేయాల్సిందే.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు