Hi Nanna : ఆమె లేకపోతే సినిమానే లేదు

ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ “నాన్న మూవీ” ఈరోజు థియేటర్లలోకి వచ్చేసింది. ప్రస్తుతం విశ్లేషకులు సినిమా అంతగా ఆకట్టుకోలేదంటూ పెదవి విరుస్తున్నారు. కానీ సినిమాకు ఆమె ఒక్కతే ప్లస్ పాయింట్ అని, ఆమె లేకపోతే అసలు సినిమానే లేదంటూ ఓ నటిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

నటి అనగానే సినిమాలో హీరోయిన్ పాత్ర పోషించిన మృణాల్ ఠాకూర్, లేదా గెస్ట్ గా నటించిన శృతిహాసన్ అనుకుంటున్నారేమో. అలా అనుకుంటే గనక మీరు తప్పులో కాలేసినట్టే. సినిమా మొత్తాన్ని నడిపించింది నాని కూతురు పాత్రలో నటించిన బేబీ కియారా ఖన్నా అంట. “హాయ్ నాన్న” మూవీలో యాక్టింగ్ పరంగా మాట్లాడుకోవాల్సి వస్తే అది కియారా గురించే అని అంటున్నారు. మహి పాత్రలో నటించిన ఈ పాప సమయానికి తగ్గట్టుగా ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ సూపర్ అని, ఎమోషనల్ సీన్స్ లో కూడా అద్భుతంగా యాక్ట్ చేసిందని, ఒక్క మాటలో చెప్పాలంటే ఆ పాప కోసం ఒకసారి ప్రేక్షకులు సినిమాను థియేటర్లలో చూడొచ్చని అంటున్నారు విమర్శకులు. తండ్రి కూతుర్ల అనుబంధం నేపథ్యంలో వచ్చిన ఈ మూవీకి కియారా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

ఇక నాని ఎప్పటిలాగే తన నేచురల్ పెర్ఫార్మెన్స్ తో మెప్పించగా, హీరోయిన్ గా నటించిన మృణాల్ కూడా బాగానే నటించింది. అయితే లుక్స్ పరంగా ఆమె మైనస్ అయినట్టుగా అనిపించిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు సినీ విశ్లేషకులు. ఇక మరో హీరోయిన్ శృతి హాసన్ బెస్ట్ రోల్ చేస్తోంది అంటూ ప్రచారం జరిగింది. కానీ ఆమె ప్రమేయాన్ని సినిమాలో గెస్ట్ అనడం కూడా ఎక్కువే అవుతుందేమో. అసలు ఏమాత్రం ఇంపార్టెన్స్ లేని క్యారెక్టర్ ను ఈ మూవీలో శృతి చేసింది.

- Advertisement -

మొత్తానికి ఇద్దరు హీరోయిన్ల ఇంపాక్ట్ కంటే ఆ చిన్న పాప ఇంపాక్ట్ సినిమాపై, ప్రేక్షకులపై ఎక్కువగా ఉంది. ఈ టాక్ చూస్తుంటే బేబీ కియారాకు టాలీవుడ్ లో మంచి భవిష్యత్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. కాగా “హాయ్ నాన్న” మూవీ భారీ అంచనాలతో రిలీజ్ కాగా, విమర్శకుల నుంచి నెగిటివ్ రివ్యూస్ అందుకుంటుంది. మరి ప్రేక్షకులు ఈ సినిమా పట్ల ఎలా రెస్పాండ్ అవుతారు అనేది ఉత్కంఠతను రేపుతోంది..రీసెంట్ గా రిలీజ్ అయిన ‘యానిమల్’ మూవీకి కూడా ఇలాగే విమర్శకుల నుంచి మిక్స్డ్ టాక్ రాగా, ప్రేక్షకులు మాత్రం బ్రహ్మరథం పట్టారు. మరి నాని మూవీకి కూడా అలాంటి మ్యాజిక్ ఏమైనా జరుగుతుందేమో చూడాలి. లేదంటే ఈ మూవీ థియేటర్లలో ఎక్కువ రోజులు ఉండడం కష్టమే.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు