Dunki First Review : “డంకీ” ఫస్ట్ రివ్యూ

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ పఠాన్, పటాన్ వంటి సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకుని, ప్రస్తుతం హ్యాట్రిక్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు. ఇక తనకు హ్యాట్రిక్ ఇవ్వడానికి పాపులర్ హిందీ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీని ఎంచుకున్నాడు. దర్శకత్వంలో షారుక్ ఖాన్ హీరోగా, తాప్సి హీరోయిన్ గా, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ “డంకీ”. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్లు సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. షారుక్ వరుస హిట్లతో జోరు మీద ఉండడం, కుమార్ హిరానీ వంటి దిగ్గజ దర్శకుడు ఈ మూవీకి డైరెక్టర్గా వ్యవహరించడంతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. భారీ హైట్ ఉన్న ఈ మూవీ డిసెంబర్ 21న రిలీజ్ అయి, హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ “సలార్” మూవీతో బాక్స్ ఆఫీస్ వద్ద రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలోనే “డంకీ” మూవీ ఫస్ట్ రివ్యూ బయటకు వచ్చింది. మరి ఫస్ట్ రివ్యూ ప్రకారం “డంకీ” మూవీ ఎలా ఉంది అనే విషయంలోకి వెళితే…

ట్రైలర్ తో సినిమాపై ఆసక్తి అయితే పెంచారు కానీ, రాజ్ కుమార్ హిరానీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయాడు అనేది టాక్. ఫస్ట్ హాఫ్ చెత్తగా ఉందని, సెకండ్ హాఫ్ ను సైతం ఎమోషనల్ సన్నివేశాలతో నెట్టుకొచ్చారని తెలుస్తోంది. అది కూడా షారుక్ అమెరికా నుంచి తిరిగి వచ్చాక జరిగే కొన్ని సన్నివేశాలు, ఎమోషనల్ సీన్స్ మాత్రమే ప్రేక్షకులను కదిలిస్తాయని తెలుస్తోంది. అంతా బోర్ కొడుతుందట. ఎప్పటిలాగే ఈ సినిమాతోనూ మంచి మెసేజ్ ఇచ్చాడట హిరానీ.

రాజ్ కుమార్ హిరానీ వీక్ వర్క్ ఇదేనంటూ విమర్శిస్తున్నారు. మొత్తానికి దర్శకుడు హిరానీ ఈ సినిమా విషయంలో ఫెయిల్ అయ్యాడు అనేది టాక్. నిజానికి హిరానీ ఒక్కో సినిమాకు మూడు నుంచి ఐదు ఏళ్ల టైం తీసుకుంటాడు. అందుకే ఆయన నుంచి వచ్చే సినిమాలన్నీ బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద చరిత్రను సృష్టించాయి. గతంలో ఆయన దర్శకత్వంలో వచ్చిన మున్నాభాయ్ ఎంబీబీఎస్, త్రీ ఇడియట్స్, పీకే, సంజు వంటి సినిమాలన్నీ అద్భుతమైన సినిమాలు. అందుకే ఆయన నుంచి సినిమా వస్తుంది అంటే ప్రేక్షకులు హీరో ఎవరు అనే విషయాన్ని సైతం పక్కనపెట్టి ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఆయన సినిమాను తెరకెక్కించే విధానం, అందులో పాత్రలను చూపించే విధానం, కథ, కథనం మనసుకు హత్తుకునే విధంగా ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ “డంకీ” విషయంలో మాత్రం ఆయన తడబడ్డట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. హిరానీ గత సినిమాలతో పోల్చుకుంటే “డంకీ” మూవీపై పెదవి విరుస్తున్నారు విమర్శకులు. మరి ప్రేక్షకుల రెస్పాన్స్ ఎలా ఉంటుందో తెలియాలంటే డిసెంబర్ 21 దాకా వెయిట్ చేయాల్సిందే.

- Advertisement -

“డంకీ” 2020లో స్టార్ట్ అయింది. ఆయన కూడా ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ తీసుకున్నారు. అయినప్పటికీ హిరానీ “డంకీ” మూవీ విషయంలో ఫెయిల్ అయ్యాడని వస్తున్న విమర్శలు రావడం ఆయన అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. “డంకీ” కేవలం 129 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన హిందీలో బడ్జెట్ మూవీ. “సలార్” మూవీతో పోటీకి సిద్ధమైన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి ఎలాంటి తీర్పు వస్తుంది అనేది ఇప్పుడు ఉత్కంఠభరితంగా మారింది.

Get the latest celebrity news updates, Bollywood movie updates, and the latest news in Tollywood here at Filmify. Also, grab Filmify for the latest movie release dates & Tollywood gossip news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు