Shivaji: శివాజీకి కొడుకులే కాదు కూతురు కూడా.. గుట్టు రట్టయిందా…?

ప్రముఖ నటుడు శివాజీ గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. మంచి మనసున్న వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత మురికి పట్టి పోయాడనే వార్తలు వినిపిస్తూ ఉంటాయి. స్వార్థపరులు, అవకాశవాదుల వైపు నిలబడి అందరితో ఛీ కొట్టించుకున్నాడు. క్రమంగా జనాలలో ఆదరణ తగ్గిపోవడంతో అవకాశాలు కూడా దూరమయ్యాయి. ప్రస్తుతం ఇంట్లో ఖాళీగా ఉన్న సమయంలో బిగ్ బాస్ నుంచి అవకాశం రావడంతో ఓకే చెప్పాడు. అలా ఇప్పుడు బిగ్ బాస్ ఏడవ సీజన్లో కంటెస్టెంట్ గా పాల్గొన్నారు..

అయితే బయటకి చెప్పేవి శ్రీరంగనీతులైనా .. చేసేది మాత్రం చిల్లర పనులు అన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అభిమానులు సైతం ఈయన వ్యక్తిత్వం పై విమర్శలు గుప్పిస్తూ ఉండడం గమనార్హం. ఆడవాళ్ళపై కూడా విచక్షణారహితంగా పిచ్చి కూతలు కూస్తున్నాడు. శోభ కోపంతో అరిచినందుకుగాను.. అలాంటి అమ్మాయిలు మా ఇంట్లో ఉంటే పీక మీద కాలేసి తొక్కేవాడిని అని నోటికి వచ్చింది వాగాడు. అయితే అలా అనడం తప్పని నాగార్జున చెప్పినా వినిపించుకోలేదు. అంతేకాదు మీ ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఇలాగే చేస్తావా? అని నాగార్జున నిలదీస్తే.. అవును ఇలాగే ప్రవర్తిస్తా.. రెండు పీకుతా అంటూ దురుసుగా సమాధానం ఇచ్చాడు శివాజీ..

దీన్ని బట్టి చూస్తే శివాజీ కి ఇద్దరూ కొడుకులే ఆయనకు కూతుర్లు లేరు అంటూ వార్తలు వినిపించాయి. అయితే శివాజీ గురించి ఎవరికీ తెలియని ఒక విషయాన్ని బయటపెట్టారు ప్రముఖ నటుడు సమీర్. అతడికి ఇద్దరు కొడుకులతోపాటు కూతురు కూడా ఉందని తెలిపాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సమీర్ మాట్లాడుతూ.. శివాజీకి ఒక కూతురు ఉంది అని తెలిపారు.. దీనికి యాంకర్.. శివాజీకి ఇద్దరు కొడుకుల తోపాటు కూతురు కూడా ఉందా? ఆని ప్రశ్నించగా.. అవును ఉంది అని.. నొక్కి మరీ చెప్పారు.. అయితే శివాజీ ఆ విషయాన్ని ఎందుకు బయట పెట్టలేదు? అంటూ నెటిజన్లు కూడా రకరకాలుగా అనుమానిస్తున్నారు. ఒకవేళ కూతురు ఉంటే ఎందుకు బయటకు చెప్పలేదు.. ఉండి కూడా ఆయన చెప్పడానికి సంకోచిస్తున్నారంటే దీని వెనుక ఏదో రహస్యం ఉండనే ఉంటుంది.. లేకపోతే సమీర్ ఎందుకు ఇలా నొక్కి మరీ చెబుతారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి దీనిపై శివాజీ ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు