Biggboss season7: ముష్టి గాళ్ళే అంతా! మళ్ళీ నోరు జారిన శివన్న..

బిగ్ బాస్ సీజన్ 7 లో సీనియర్ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన శివాజీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నటుడుగా బయట ఎంతో పాపులర్ అయిన ఈయన బిగ్ బాస్ లోకి వచ్చి మరింత పాపులారిటీ ని సంపాదించాడు. యాభై ఏళ్లయినా ఫిజికల్ టాస్కుల్లో తనదైన శైలిలో ఆడడమే గాకుండా, తన మైండ్ గేమ్స్ తో ఆటల్లో విన్నర్ అవుతూ ఫైనల్ వీక్ దాకా వచ్చాడు.

అయితే శివాజీ ఆడే ఆటల కన్నా వ్యక్తిగతంగా బిగ్ బాస్ హౌస్ లో పెద్దన్న లా మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ గత కొన్ని రోజులుగా బిగ్ బాస్ హౌస్ లో ఆయన సహనం కోల్పోతూ తొందరపడి మాటలు అనాల్సి వస్తుంది. లాస్ట్ వీక్ కూడా ఓసారి అలాంటి ఆడవాళ్ళని పీక మీద కాలేసి తొక్కేస్తా? అంటూ నోరు జారీ ఆడియన్స్ ద్రుష్టిలో నెగిటివ్ అయ్యాడు. తాను కావాలని అనలేదని అన్నా, నాగార్జున అయితే గట్టి వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది.

తాజాగా మరో సారి బిగ్ బాస్ హౌస్ లో స్పా బ్యాచ్ ని ముష్టిగాళ్ళు అంటూ అన్నాడు. ఈ మాట వాళ్ళ ముందు అనుకున్నా, ఎదో సరదాగా యావర్ తో కూర్చుని ఉన్నప్పుడు ఈ మాట అన్నాడు. అతను క్యాజ్యువల్ గా, సరదాగా అన్నా కూడా ఆడియన్స్ చూసే ఈ షో లో అలాంటి పదాలు అనడం కరెక్ట్ కాదని కొందరి అభిప్రాయం. ఏది ఏమైనా మరో రెండు రోజుల్లో బిగ్ బాస్ షో అయిపోతుంది. మరి హౌస్ లో ఉన్న ఆరుగురిలో ఎవరికీ కప్ వస్తుందో చూడాలి.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు