Deepika Padukone: రణబీర్ కంటే హృతిక్ కంఫర్ట్… దీపిక సెన్సెషనల్ కామెంట్స్

ఇప్పటి వరకు చాలా టాక్ షోలు వచ్చాయి. కానీ, బాలీవుడ్ లో వచ్చే కాఫీ విత్ కరణ్ అనే టాక్ షోకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. సెలబ్రెటీలను పర్సనల్ ప్రశ్నలు వేసే కరణ్ జోహర్.. ప్రతి సీజన్ కు అందులో డోస్ పెంచుతాడు. గత సీజన్ లో అయితే సెలబ్రెటీలను ఏకంగా బెడ్ రూంకి సంబంధించిన ప్రశ్నలు వేశాడు. ఈ సారి అంతకు మించి ఉంటుందని, ప్రోమోలతోనే చెప్పేశాడు. ఇప్పటి వరకు ఏడు సీజన్స్ పూర్తి అయ్యాయి. తాజాగా 8వ సీజన్ వస్తుంది. కాఫీ విత్ కరణ్ జోహర్ 8వ సీజన్ కి గెస్ట్ లుగా బాలీవుడ్ హాట్ పెయిర్ రణవీర్ సింగ్ – దీపికా పదుకుణె వచ్చారు. దానికి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదల అయింది.

ఈ ప్రోమో చూస్తే… పచ్చగా ఉన్న రణవీర్ సింగ్ – దీపికా పదుకుణెల కాపురంలో కరణ్ కారం చల్లాడని అనిపిస్తుంది. ప్రోమోలో కరణ్ అడిగిన ఒక ప్రశ్న హైలైట్ అవుతుంది. ఇండస్ట్రీలో నీకు బెస్ట్ కెమీస్ట్రీ ఎవరితో ఉంటుంది అని కరణ్ ఓ ప్రశ్న వేశాడు. దీపికా ఏ మాత్రం ఆలోచించకండా… హృతిక్ రోషన్ పేరు చేప్పేసింది. పక్కన దీపిక భర్త రణవీర్ సింగ్ తో పాటు కరణ్ జోహర్ ఆశ్చర్యపోయాడు. నిజానికి హృతిక్ తో దీపికా ఎక్కువ సినిమాలు చేయలేదు. వీరి కాంబోలో ఫైటర్ అనే సినిమా ఇప్పుడు రాబోతుంది. ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ ఎక్కువగానే ఉన్నాయట.

అందుకే హృతిక్ పేరు చెప్పి ఉంటుందని అనుకుంటున్నారు. అయితే ఇండస్ట్రీలో హాటెస్ట్ హీరో ఎవరు అంటే అప్పుడు దీపిక నుంచి సమాధానం… రణబీర్ కపూర్ అని వచ్చింది. ఈ రెండు ప్రశ్నలకు భర్త రణవీర్ సింగ్ పేరు రాలేదు. దీంతో ఫస్ట్ ఎపిసోడ్ లోనే రణవీర్, దీపిక ల మధ్య కరణ్ చిచ్చు పెట్టబోతున్నాడు అని అర్థమవుతుంది. కాగా, రణవీర్, దీపికా పదుకొణె డీవోర్స్ తీసుకోబోతున్నట్టు, వీరి మధ్య గొడవలు అవుతున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు