Kangana Ranaut New Movie: తేజస్ అయినా గట్టేక్కిస్తుందా?

బాలీవుడ్ కే కాదు.. సినిమా ఇండస్ట్రీకే ఫైర్ బ్రాండ్ కంగనా రౌనత్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రభాస్ తో ఏక్ నిరంజన్ సినిమాతో ఇండస్ట్రీకి ఏంట్రీ ఇచ్చిన కంగనా… ఈ చిత్రం తర్వాత డైరెక్ట్ బాలీవుడ్ బాట పట్టి అక్కడే సినిమాలు చేస్తుంది. ఆమె సినిమాల కంటే, ఆమె చేసే వ్యాఖ్యలతోనే ఎప్పుడు వార్తల్లో ఉంటుంది. అందుకే కంగనాను ఫైర్ బ్రాండ్ అంటారు. ఈ బ్యూటీ ఇండస్ట్రీలో చాలా ఏళ్ల నుంచి ఉంటుంది. కానీ, ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం లేదు. ఈ మధ్య కాలంలో కంగనా నుంచి వచ్చే సినిమాలు అయితే మరీ దారుణం.

ధాకడ్ చిత్రం అయితే కోలుకోలేని దెబ్బ వేసింది. 80 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం, కనీసం 8 కోట్లు కూడా కలెక్ట్ చేయలేకపోయింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న చంద్రముఖి2 కూడా కంగనాను కాపాడలేకపోయింది. ఇప్పుడు ఈ అమ్మడి ఆశలు మొత్తం తేజస్ చిత్రంపైనే ఉన్నాయి. ధైర్య సాహసాలు ఉన్న తేజస్ గిల్ అనే ఎయిర్ ఫోర్స్ అధికారి బయోపిక్ ని తేజస్ అనే సినిమాగా సర్వేశ్ మేవారా అనే దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్థాన్ లో చేపట్టిన ఓ ఫోర్స్ సీక్రెట్ ఆఫరేషన్ గురించి ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పై ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు మంచి ఫలితాన్ని ఇచ్చాయి. దేశ భక్తి భావం… సైనికుల ధైర్య సాహసాలు చూడటానికి ఆడియన్స్ కి ఎప్పుడైన ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ చిన్న హోప్ తోనే తేజస్ సినిమాను కంగనా రౌనత్ ఎక్కువగా నమ్ముతుంది. ఈ మూవీ ఈ శుక్రవారం రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా హిట్ అయితే, పాతాళంలోకి పడి పోయిన కంగనా రౌనత్ కెరీర్ కి హెల్ప్ అవుతుంది. ఎప్పటి లాగే, ఈ సినిమా కూడా బొల్తా కోడితే, కంగనా సినిమాలు చేయడం మానుకోవాల్సిందే ఇక.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు