Mega Family: సురేఖ, ఉపాసన, లావణ్యలో ఓ కామన్ పాయింట్ – అది ఏంటో తెలుసా?

టాలీవుడ్ సొట్ట బుగ్గల హీరోయిన్ లావణ్య త్రిపాఠి మెగా కంపౌండ్ లోకి కోడలుగా అడుగు పెట్టబోతుంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ, లావణ్య త్రిపాఠి నవంబర్ 1న ఇటలిలో డిస్టినేషన్ వెడ్డింగ్ తో ఒక్కటి కాబోతున్నారు. లావణ్య త్రిపాఠి ఇటీవల తన ఫ్రెండ్స్ కి బ్యాచిలర్స్ పార్టీని కూడా ఇచ్చేసింది. అలాగే రామ్ చరణ్, ఉపాసన పెళ్లి పనులు చూసుకోవడానికి ఇటిలికి వెళ్లిపోయారు. ఇటీవల అమ్మతో కలిసి వరుణ్ తేజ్ కూడా ఇటిలి ఫ్లైట్ ఎక్కేశాడు.

అలా మెగా ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు పెళ్లి బిజీలో ఉంది. మెగా ఫ్యామిలిలో చిరంజీవి భార్య సురేఖ అందరికీ కంటే పెద్ద కోడలు. తర్వాత తరంలో చూస్తే రామ్ చరణ్ భార్య ఉపాసన కు మెగా ఇంటికి పెద్ద కోడలు అంటారు. అయితే వీరి ఇద్దరికి ఓ కామన్ పాయింట్ ఉంది. ఆ కామన్ క్వాలిటీ ఇప్పుడు మెగా ఫ్యామిలీలో కొత్తగా చేరబోతున్న లావణ్య త్రిపాఠికి కూడా ఉంది.

ఆ కామన్ క్వాలిటీ ఏంటంటే… సేవా గుణం. పేద ప్రజలకు సాయం చేయడం. సురేఖ గానీ, ఉపాసన గానీ ఇప్పటి వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. డబ్బులను విరాళాలుగా ఇస్తారు. ఇప్పుడు కొత్తగా రాబోతున్న లావణ్య త్రిపాఠి కూడా సేవ చేయడంలో మెగా కుటుంబానికి ఏ మాత్రం తగ్గదు. ఇప్పటికే తనకు వచ్చే సంపాదనలో సగ భాగం వరకు పేద ప్రజలకు కోసం ఖర్చు చేస్తుంది లావణ్య. కొన్ని బయటికి వచ్చినా, లావణ్య రహస్యంగా చేసిన సేవలు చాలా ఉన్నాయట.

- Advertisement -

ఇది ఇప్పుడు బయటకి తెలియడంతో మెగా ఫ్యామిలీకి కోడలుగా కావాల్సిన బెటర్ క్వాలిటీ లావణ్య దగ్గర ఉందని, ఈ అర్హతతో మెగా ఫ్యామిలీలో చేరిపోవచ్చు అని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. కాగ, సేవ విషయంలో మెగా ఫ్యామిలీ ఎప్పుడూ ముందు ఉంటుందన్న సంగతి తెలిసిందే. చిరంజీవి, నాగ బాబు, ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసే సేవల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వీరికి పోటీగా మెగా ఫ్యామిలీ కోడళ్లు కూడా సేవ చేస్తున్నారు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు