Benifits With Eggs: రోజు రెండు గుడ్లు తినడం వల్ల కలిగే లాభాలు..!

బరువు పెరగాలన్నా, తగ్గాలన్నా మన డైట్ లో ప్రోటీన్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయి. అలాంటి ప్రోటీన్స్ తో పాటు జింక్, కాల్షియం,విటమిన్ A, విటమిన్ B , విటమిన్ D, E వంటి చాలా పోషకాలు ఎగ్స్ లో ఉంటాయి. రోజు ఒక ఎగ్ తినడం ద్వారా ఆరోగ్యానికి మంచిదని మనం చిన్నప్పటి నుండి వింటూనే ఉన్నాం కాబట్టి రోజు రెండు ఎగ్స్ మన డైట్ లో భాగంగా తీసుకోవడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

రోజు ఎగ్స్ తింటే కలిగే లాభాలు :

బ్రెయిన్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది :

నేషనల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ అధ్యయనం ప్రకారం బ్రెయిన్ హెల్త్ ఇంప్రూవ్ ఆవటంలో కోలైన్ అనే విటమిన్ కీలక పాత్ర పోషిస్తుందని తెలుస్తోంది, కోలైన్ అనే విటమిన్ ని మన బాడీ స్వతహాగా ప్రొడ్యూస్ చేయలేదు. విటమిన్ డెఫిషియన్సీ వల్ల మనలో మెమరీ లాస్ వంటి ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది. నిపుణుల చెప్తున్న దాని ప్రకారం మహిళలకు ఒక రోజుకు 425 మిల్లి గ్రాముల కోలైన్ విటమిన్ అవసరం ఉంటుంది. పురుషులకు 550 మిల్లి గ్రాముల కోలైన్ విటమిన్ ఆవరసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో రోజు రెండు బాయిల్డ్ ఎగ్స్ తింటే దాదాపు 300 మిల్లి గ్రాముల కోలైన్ విటమిన్ మనకు లభిస్తుంది. ఆ రకంగా బ్రెయిన్ ని హెల్తీగా ఉంచుకోవటం కోసం రోజు రెండు బాయిల్డ్ ఎగ్స్ తినడం మంచిది.

కళ్ళు, చర్మాన్ని కాపాడుకోవచ్చు :

ఎగ్స్ లో ఉండే విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల కళ్ళు మరియు చర్మాన్ని హెల్తీగా ఉంచుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు. ఎగ్స్ క్రమం తప్పకుండ తినటం మ్యాక్యులర్ డిజెనరేషన్, క్యాటరాక్ట్ వంటి సమస్యల నుండి బారిన పడకుండా ఉండచ్చని చెప్తున్నారు డాక్టర్స్.

- Advertisement -

వెయిట్ మేనేజ్మెంట్ కి హెల్ప్ అవుతుంది :

ఎగ్స్ మన శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్, హెల్తీ ఫ్యాట్స్ ని అందిస్తాయని, దీని వల్ల ఓవర్ ఈటింగ్ సమస్య రాదని నిపుణులు చెప్తున్నారు. వివిధ అధ్యయనాల ప్రకారం  బ్రేక్ ఫాస్ట్ లో ఎగ్ తీసుకోవటం వల్ల రోజు మొత్తంలో తీసుకునే క్యాలరీల సంఖ్య తగ్గి వెయిట్ లాస్ కి తోడ్పడుతుందని తెలుస్తోంది.

బ్లడ్, షుగర్ లెవెల్స్ ని రెగ్యులేట్ చేస్తుంది :

ఎగ్స్ లో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారు ఎలాంటి భయం లేకుండా ఎగ్స్ తినొచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా బ్రేక్ ఫాస్ట్ లో ఎగ్స్ తీసుకోవటం వల్ల ఎనర్జీ లెవెల్స్ పెరగటం, మెటబాలిక్ యాక్టివిటీ హార్మోన్ ప్రొడక్షన్ రెగ్యులేట్ అవుతుందని తెలుస్తోంది.

హార్ట్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది :

ఎగ్స్ లో విటమిన్ A, E, B లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి కార్డియాక్ అరెస్ట్ వంటి ప్రమాదాలు రాకుండా కాపాడుతుంది. ఈ విటమిన్స్ వల్ల బ్లడ్ వెజెల్స్ వైడెన్ అవుతాయి కాబట్టి హార్ట్ అటాక్స్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఎగ్స్ లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ కొలెస్ట్రాల్ లెవెల్ ని మైంటైన్ చేయటంలో హెల్ప్ అవుతాయి.

ఫర్టిలిటీ ఇంప్రూవ్ అవుతుంది :

ఎగ్స్ లో లభించే విటమిన్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల మహిళల్లో ఫర్టిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ స్ట్రెస్ ని తగ్గించి స్పెర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వటంతో హెల్ప్ అవుతుంది. విటమిన్ B 12, E వల్ల స్పెర్మ్ DNA డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది.

ఇమ్యూనిటీ పెంచుతుంది :

ఎగ్స్ లో లభించే విటమిన్ E యాంటీ ఆక్సిడెంట్ గా పని చేసి కెమికల్స్ నుండి కాపాడి ఇమ్యూనిటీ పెంచటంలో తోడ్పడుతుంది. ప్రమాదకరమైన గుండె జబ్బులు క్యాన్సర్ వంటివి రాకుండా ఎగ్స్ లోని విటమిన్స్ కాపాడతాయి. ఎగ్స్ లో లభించే జింక్ వల్ల జేమ్స్, వైరస్ ల బారిన పడకుండా ఇమ్యూనిటీ పెరుగుతుంది.

విటమిన్ D పుష్కలంగా లభిస్తుంది :

క్యాల్షియం, పాస్ఫరస్ వంటి పోషకాలు విటమిన్ D వల్ల పుష్కలంగా లభిస్తాయి. ఈ విటమిన్ D ఎగ్స్ లో చాలా ఎక్కువగా ఉంటుంది. డిప్రెషన్, డయాబెటిస్ వంటి సమస్యల నుండి కాపాడుతుంది విటమిన్ D.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు